ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు

మండలం బొరివంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు 65 ప్రదర్శనలు ఇచ్చారు. వీటిలో గ్రూప్‌ విభాగంలో రాజపురం జిల్లా పరిషత్‌

కవిటి : ప్రదర్శనలు వివరిస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి- కవిటి

మండలం బొరివంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు 65 ప్రదర్శనలు ఇచ్చారు. వీటిలో గ్రూప్‌ విభాగంలో రాజపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు అబినేష్‌, రామ్‌ చరణ్‌ రూపొందించిన సెన్సార్‌ బేస్డ్‌ రైల్వే ప్రాజెక్ట్‌ ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికవ్వగా, వ్యక్తిగత విభాగంలో బొరివంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఆర్‌.జీవన్‌ కుమార్‌ రూపొందించిన హైడ్రాలిక్‌ ట్రాఫిక్‌ రిడక్షన్‌ సిస్టం ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌.రామకృష్ణ తెలిపారు. కుసుంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన యాసిడ్‌ రైస్‌ ద్వితీయ స్థానంలో నిలవగా, వ్యక్తిగత విభాగంలో కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి రూపొందించిన మిల్లెట్స్‌ ఫర్‌ హెల్దీ లైఫ్‌ ప్రదర్శన ద్వితీయస్థానం దక్కించుకుంది. ఉపాధ్యాయ విభాగంలో ఇద్దివానిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎం మురళీ కృష్ణ రూపొందించిన డయాబెటిస్‌ – కంట్రోల్‌ ప్రాజెక్ట్‌ జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. విజేతలకు ఎంపిటిసి డి.సతీష్‌ కుమార్‌, విద్యా కమిటీ చైర్మన్‌ బొనమాలి మజ్జి బహుమతులు అందజేశారు.జి సిగడాం : విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలని ఎంఇఒ అరసాడ రవి అన్నారు. జి.సిగడాం ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదివ తరగతి విద్యార్ధి రాహుల్‌, ఆదర్శ పాఠశాలకు చెందిన ఉదరు కుమార్‌, జ్యోతి కుమార్‌లు మండలస్థాయి విజేతలుగా ఎన్నికైనట్టు ఎంఇఒ తెలిపారు. కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ లంక అన్నా శామ్యూల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆమదాలవలస: విద్యార్థులు సృజనాత్మకతను అలవర్చుకోవాలని ఎంఇఒ గెడ్డాపు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు 66 ప్రాజెక్టులు వచ్చాయి. జిల్లాస్థాయికి మూడు ప్రాజెక్టులను ఎంపిక చేశారు. గ్రూపు విభాగం నుండి ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్‌.సాయి గణేష్‌, బి. దిలీప్‌, వ్యక్తిగత విభాగం నుంచి జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ తొగరాం నుంచి చరణ్‌ తేజ, టీచర్‌ విభాగం నుంచి మున్సిపల్‌ హైస్కూల్‌ చింతాడ నుంచి హేమంత్‌ సాయి ప్రాజెక్టులు సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనలో ఎంపిక కాబడ్డాయి. కార్యక్రమంలో హెచ్‌ఎం కె.ఎ.రాములు, సిఎంఒ జిల్లా సమగ్ర శిక్షణా పరిశీలకులుగా పేడాడ ప్రభాకరరావు, పలు పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

➡️