ఆరు వారాలుగా అందని ‘ఉపాధి’ కూలి

ఆరు వారాలుగా ఉపాధి వేతనాలు తమకు అందలేదని వెంటనే వేతనాలు అందేలా చూడాలని ఉపాధిహామీ కూలీలు

స్పీకర్‌ వద్ద మొర పెట్టుకుంటున్న కూలీలు

స్పీకర్‌ వద్ద మొరపెట్టుకున్న కూలీలు

ప్రజాశక్తి- సరుబుజ్జిలి ఆరు వారాలుగా ఉపాధి వేతనాలు తమకు అందలేదని వెంటనే వేతనాలు అందేలా చూడాలని ఉపాధిహామీ కూలీలు స్పీకర్‌ తమ్మినేని సీతారాం దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం మండలంలో పాలవలస గ్రామ సచివాలయ పరిధిలో పాలవలస, పాలవలస కాలనీ, పెద్ద వెంకటాపురం గ్రామాల్లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు తమకు వేతనాలు అందడం లేదని, సంక్రాంతి ముందు వేతనాలు అందేటట్లు చూడాలని స్పీకర్‌ను కోరారు. వెంటనే ఎంపిడిఒ మురళీ మోహన్‌ కుమార్‌, ఉపాధిహామీ ఎపిఒ బి.పార్వతిని పిలిచి నాలుగు వారాలుగా కూలీలకు వేతనాలు అందకపోవడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ఉద్యానవన శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున తక్షణమే కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు గ్రామ సచివాలయ ఉద్యానవన శాఖ అసిస్టెంట్లుగా ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రతినిధులు డి.త్రినాధరావు, ఎస్‌.స్వాగత్‌ కుమార్‌, రేవతి, బి.సంజరు భార్గవ్‌ స్పీకర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితుడు కెవిజి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సురవరపు నాగేశ్వరరావు, వైస్‌ ఎంపిపి గోవిందు శివానందమూర్తి, తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

 

➡️