ఇళ్ల రిజిస్ట్రేషన్లు వేగవంతం

నగరపాలక సంస్థ పరిధిలో

సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు అందజేసిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని బాకర్‌సాహెబ్‌పేట వార్డు సచివాలయాన్ని మంగళవారం సందర్శించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. సచివాలయం పరిధిలో మంజూరు చేసిన పట్టాల్లో సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్న వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని శతశాతం పూర్తి చేయాలన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి, అందుకనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

➡️