ఇవిఎం గోదాములు తనిఖీ

జిల్లా కేంద్రంలోని ఇవిఎం గోదాములను

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

జిల్లా కేంద్రంలోని ఇవిఎం గోదాములను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ బుధవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఇవిఎంలను భద్రపరిచిన గోదాములను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు. గోదాముల్లో భద్రతా చర్యలపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ ప్రకాశరావు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️