ఈ ఐదేళ్ల పాలన రాతి యుగం

అనుభవం, బాధ్యత ఉన్న నేతగా రాష్ట్ర

కవిటి : మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

ప్రజాశక్తి- కవిటి

అనుభవం, బాధ్యత ఉన్న నేతగా రాష్ట్ర భవిష్యత్‌, ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. మండలంలోని రామయ్యపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగళంలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు తాను డ్రైవర్‌గా అభివర్ణించారని అన్నారు. ప్రజలను రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపించే రథసారథి చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు బెందాళం రమేష్‌, సీపాన వెంకటరమణ, సంతోష్‌ పట్నాయక్‌, మణిచంద్ర ప్రకాష్‌ పాల్గొన్నారు.శ్రీకాకుళం అర్బన్‌ : జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రజలు జీవితాలు వెనక్కి నెట్టబడ్డాయని, రాతియుగం నాటి అవశేషాలను మిగిల్చి మిగిలివన్నీ దోచుకున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా టిడిపి కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి తిరిగి ప్రగతి పథం వైపు నడిపించాలంటే చంద్రబాబువల్లే సాధ్యమవుతుందని చెప్పారు. రాతియుగం నుంచి తిరిగి స్వర్గయుగం వైపునకు నడిపించేందుకు చంద్రబాబు డ్రైవరు నవుతానని చెప్పడం ఆయన సమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అసమర్థ, అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. యువత బాగుకోరే చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావాలన్నారు.

➡️