ఉద్యమ స్ఫూర్తి షేక్‌ సాబ్జీ

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందడం ఉపాధ్యాయ ఉద్యమానికి తీరనిలోటని సమగ్ర శిక్ష యంఐఎస్‌ కో-ఆర్డినేటర్స్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సంఘం వ్యవస్థాపకుడు పి.బాలరాజు అన్నారు. కాశీబుగ్గ విద్యాశాఖాధికారి కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్‌ సంఘాన్ని

లావేరు : మాట్లాడుతున్న గిరిధర్‌

ప్రజాశక్తి- పలాస

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందడం ఉపాధ్యాయ ఉద్యమానికి తీరనిలోటని సమగ్ర శిక్ష యంఐఎస్‌ కో-ఆర్డినేటర్స్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సంఘం వ్యవస్థాపకుడు పి.బాలరాజు అన్నారు. కాశీబుగ్గ విద్యాశాఖాధికారి కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్‌ సంఘాన్ని అగ్రపథంలో నడిపి, ఉపాధ్యాయ లోకంలో ఆశాదీపంగా వెలిగిన వ్యక్తి సాబ్జి అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.మురళీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ఎస్‌.గౌరీ శంకర్‌ పాల్గొన్నారు. లావేరు: ఉపాధ్యాయ నాయకులు, ఎమ్మెల్సీ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని యుటిఎఫ్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ అన్నారు. మండలంలో అదపాక జెడ్‌పి పాఠశాలలో హెచ్‌ఎం పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.బాలకృష్ణ, ఎన్‌.కృష్ణారావు, పి.లక్మణరావు, ఉదయకుమార్‌, మురళి, వాసుదేవరావు, రుద్రప్రతాప్‌, ఎన్‌వి రమణ, రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.నందిగాం: నిన్న జరిగిన ఘోరరోడ్డుప్రమాదంలో ప్రణాలు కోల్పోయిన ఉద్యమ నేత పిడిఎఫ్‌. ఎమ్మెల్సీ, యుటిఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు షేక్‌ సాబ్జీకి నందిగాం యుటిఎఫ్‌ మండలశాఖ అధ్యక్షులు కె.కుమారస్వామి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వై.గణపితిరావు, విశ్రాంతి ఉపాధ్యాయులు, సీనియర్‌ యుటిఎఫ్‌ నాయకులు వజ్జ సింహాచలం, మండల గౌరవాధ్యక్షులు జె.చంద్రశేఖరరావు, జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు, కార్యవర్గసభ్యులు అప్పలస్వామి, సురేష్‌, ధర్మారావు, రమేష్‌, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాళి: ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ మృతికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం ఐసిడిఎస్‌ కార్యాలయ అవరణలో జనసేన నాయకులతో కలిసి అంగన్వాడీలు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు హనుమంతు ఈశ్వరరావు, దుంపల సుదర్శన, టిడిపి నాయకులు తర్ర రామకృష్ణ, వెలమల కామేశ్వరరావు, పూజారి శైలజ, బెండి అన్నపూర్ణ, దేవాది సింహాద్రి, ఎస్‌.శ్రీనివాస్‌, కర్రి అప్పారావు, గొండు లక్ష్మణరావు, పట్ట సింహాచలం, జనసేన నాయకులు, అంగన్వాడీ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సోంపేట: యుటిఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ సంతాప సమావేశం నిర్వహించారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు లండ బాబూరావు, మండల శాఖ అధ్యక్షులు కూర్మారావు, ప్రధాన కార్యదర్శి దొరబాబు, జానకి రామయ్య, కాళిదాసు, లక్కోజి రవికుమార్‌, జి.ప్రకాష్‌, సుశీల, హేమచంద్ర, శ్రీనివాసరావు, తేజ మూర్తి పాల్గొన్నారు.

 

➡️