ఉప్పు రైతుకు ఉపాధి ముప్పు

పడ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది

ఉప్పు సాగు చేయక వదిలేసిన గల్లీలు

  • పనుల్లేక కార్మికులు
  • కూలీల అవస్థలు

ప్రజాశక్తి- నౌపడ

నౌపడ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఉప్పు పరిశ్రమ. గతంలో సుమారు ఐదు వేల కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి జీవనం సాగించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య వందల్లో ఉంది. మూడేళ్లుగా రైతులు, కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలకు ఆశించిన స్థాయిలో పనులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నౌపడ, ఇచ్ఛాపురం, పూండి, మర్రిపాడు, సెలగపేట, కళింగపట్నం, సీతానగరం, యామాలపేట, మూలపేట ప్రాంతాల్లో సుమారు ఐదు వేల ఎకరాల వరకు రైతులు ఉప్పు పండించి రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఉప్పు భూములు లీజు కాలపరిమితి ముగియడంతో రైతులు ఎవరు ఉప్పు పండించేందుకు ముందుకు రావడం లేదు. అక్కడక్కడ కొందరు రైతులు ఉప్పు పండిస్తున్నా వాతావరణం మార్పు, అధిక పెట్టుబడి, దళారులు చేతివాటంతో నష్టపోతున్నారు.ధర పలికినా దిగుబడి లేదు సంతబొమ్మాళి మండల పరిధి తీర ప్రాంత గ్రామాల్లో పేద కుటుంబాలు ఉప్పు పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా డిసెంబరులో పనులు ప్రారంభించి జూన్‌ చివరి నాటికి పూర్తి చేస్తారు. వాతావరణం అనుకూలించకపోవడం, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పదేళ్లుగా ఉప్పు ఉత్పత్తి తగ్గింది. ఈ సీజన్లో పంటకు ధర ఉన్నా దిగు బడి లేదు. నౌపడలో 250 మంది ఉప్పు ఉత్పత్తిదారుల అనుమతులు పునరుద్ధరించక పోవడంతో ఈ ఏడాది ఉప్పు సాగుపై ఆసక్తి చూపలేదు. గతంలో 50 వేల మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి అయ్యేది. ప్రస్తుతం 10 వేల మెట్రిక్‌ టన్నులకు పడిపోయింది. ప్రస్తుతం 50 కిలోల బస్తా రూ.150-250 వరకు పలుకుతోంది.వలస కూలీలుగా మారిన కార్మికులుఏటా జనవరి నుంచి జూన్‌ వరకు రోజూ ఉప్పు మడుల్లో పనిచేసే ఉప్పు కార్మికులు, పలువురు రైతులు వలసలు పోయి కూలి పనులు చేసుకుంటున్నారు. చెన్నరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో తాపీ పనులు, రైస్‌ మిల్లులో, కళాసీలుగా పనిచేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఉక్కు పండించేందుకు ఇక్కడికి వచ్చిన కార్మికులు కూడా పనులు లేక సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. రాజస్థాన్‌ వచ్చిన కూలీలు ట్రాక్టర్లు, డోజర్లు, ప్రొకెక్లయిన్లకు పనులు నిత్యం చేస్తూ ఉండేవారు. వారికీ పనులు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో ఉప్పు పంటే ఆధారం. దీంతో చేసేది ఏమీ లేక వలస కూలీలుగా మారిపోతున్నారు. అక్కడి పనులు అలవాటు లేక ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు కార్మికులకు చేతినిండా పని ఉండేది. ఈ వంద మందిలో నలుగురికి మాత్రమే ఉపాధి దొరికే పరిస్థితి ఉంది.ఉపాధి చూపాలిఈ ఏడాది ఉప్పు సాగు ఆశించిన స్థాయిలో లేదు. సీజన్‌లో పనులు లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాం. అధికారులు స్పందించి ప్రజలకు గ్రామాల్లో ఉపాధి చూపాలి. గ్రామీణ ఉపాధి హామీ పనులూ సక్రమంగా ఇవ్వడం లేదు. అధికారులు స్పందించాలి. – కర్రి చిన్నబాబు, నౌపడ ఉపాధి లేక వలసలు పోతున్నారుప్రధానంగా ఉప్పు పంటపై గిట్టుబాటు లేదు. ఏటా వర్షాలు, తుపాన్లకు నష్టపోతున్నాం. మరో వైపు లీజు ముగియడంతో వలసలు అధికమవుతున్నాయి. లీజు గడువు పొడిగించాలి. పంటకు తగినంత గిట్టుబాటు ధర కల్పించినట్లయితే వలసలు తగ్గి, మళ్లీ పంటకు పూర్వవైభవం వస్తుంది.- కర్రి కాంతారావు, ఉప్పు ఉత్పత్తి లైసెన్స్‌ దారుడు

➡️