ఎస్‌ఇబి ఎఎస్‌పిగా వినీష

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఇబి)

ఎస్‌పికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్‌ఇబి ఎఎస్‌పి వినీష

ప్రజాశక్తి – శ్రీకాకుళం

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఇబి) అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఎం.వినీష నియమితులయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధికను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఆరుగురికి ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతిఇటీవల విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో పలువురు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని ఎస్‌ఐలుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఆరుగురు ఎఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా అవకాశం లభించింది. వీరిలో ముగ్గురికి జిల్లాలో, మరో ముగ్గురికి రేంజ్‌ పరిధిలో ఎస్‌ఐలుగా కేటాయించారు. జిల్లాకు కేటాయించిన ఎస్‌ఐలు పి.ఢిల్లీరావు, పి.వి రమణ, కె.శివాజీ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధికను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ఎస్‌పి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగోన్నతి ఉద్యోగులకు మరింత బాధ్యత పెంచుతుందని, విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి జి.ప్రేమ్‌ కాజల్‌ ఉన్నారు.

➡️