ఎఎస్‌పిలు బదిలీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అదనపు

పుష్పగుచ్ఛం అందిస్తున్న తిరుపతి నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అదనపు ఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్‌ (క్రైమ్‌), జె.తిప్పేస్వామి (అడ్మిన్‌) బదిలీ అయ్యారు. జిల్లాలో మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న విఠలేశ్వర్‌ను ఎసిబికి బదిలీ చేశారు. గతేడాది మేలో ఎఎస్‌పి అడ్మిన్‌గా బాధ్యతలు స్వీకరించిన తిప్పేస్వామిని అనంతపురంలోని పోలీస్‌ అకాడమీకి బదిలీ చేశారు. వారి స్థానంలో కాకినాడలో ఎస్‌ఇబి ఎఎస్‌పిగా పనిచేస్తున్న ప్రేమకాజల్‌ అడ్మిన్‌, ఏలూరు ఎస్‌సి, ఎస్‌టి డిఎస్‌పిగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు క్రైమ్‌ ఎఎస్‌పిలుగా నియమించారు.ఎస్‌ఇబి సూపరింటెండెంట్‌ బాధ్యతల స్వీకరణస్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరింటెండెంట్‌గా సిహెచ్‌.తిరుపతి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్‌ఇబి ఎఎస్‌పిగా పనిచేసిన వి.ఎన్‌ మణికంఠ విశాఖపట్నం బదిలీ అయ్యారు. తిరుపతినాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఎస్‌ఇబి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధికను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

➡️