ఎన్‌జిఒ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చౌదరి

ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చౌదరి పురుషోత్తం

పురుషోత్తం నాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చౌదరి పురుషోత్తం నాయుడు ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ కావడంతో విజయవాడలో గురువారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో అధ్యక్షునిగా శివారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం నాయుడులను ఎన్నుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సహాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయన నాలుగుసార్లు ఉపాధ్యక్షుడిగా, సహాధ్యక్షులుగా పనిచేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు చౌదరి తేజేశ్వరరావు కుమారుడైన ఆయన ఉద్యోగుల సమస్యలపై దశాబ్ధాల తరబడి అలుపెరుగని పోరాటం చేస్తూ అంచలంచెలుగా ఎదిగారు. జిల్లా అద్యక్షునిగా, వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘానికి ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షునిగా గతంలో ఆయన పనిచేశారు. ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంపై జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ ఇంత వరకు ఉత్తరాంధ్ర నుంచి ప్రధాన కార్యదర్శి పదవికి గతంలో ఎవరూ ఎన్నిక కాలేదు. తొలిసారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి వ్యక్తి అని ఉద్యోగులు కొనియాడారు. ఉద్యోగుల సమస్యలపై ఆయన నిరంతరం పోరాడే వ్యక్తి అని కొనియాడారు.

 

➡️