ఎన్నికల ఖర్చులకు ఖాతాలు తెరవాలి

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు

సమీక్షిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతాలను తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో జెసి ఎం.నవీన్‌తో కలిసి ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు సంబంధించి జిల్లాలోని 27 ప్రధాన బ్యాంకుల సీనియర్‌ అధికారులతో బ్యాంకర్ల కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థులు తమ పేరున, వారి ఏజెంట్‌, జాయింట్‌ ఖాతాలనూ తెరవవచ్చని అన్నారు. అభ్యర్థి నామి నేషన్‌ దాఖలు చేయడానికి ఒక రోజు ముందూ ఖాతా తెరవవచ్చని స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు ఏదైనా బ్యాంకు, పోస్టాఫీసులో కూడా తెరవవచ్చని అన్నారు. అన్ని బ్యాంకులు ప్రత్యేక కౌంటర్‌ను తెరిచి, ప్రాధాన్యతా ప్రాతిపదికన ఖాతాలో డిపాజిట్‌, ఉపసం హరణలకు వీరికి అనుమతించాలని సూచించారు. బ్యాంకుల నుంచి పెద్దఎత్తున జరిగే నగదు ఉపసంహరణ లావాదేవీలపై పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బ్యాంకులను ఆదేశించారు. జిల్లాలోని 288 వివిధ బ్యాంకుల శాఖలు రోజూ తమకు సూచించిన ఐదు నివేదికలను నిర్ధేశిత సమయంలోగా ఈమెయిల్‌ ద్వారా చేరవేయాలని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే బ్యాంకులు జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా అయితే అన్ని బ్యాంకులు డిఇఒలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి అవసరమైన చర్యల కోసం తాము ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని పంపిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో, నగదు రవాణా కోసం ఇఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌ నుంచి బ్యాంకుల ద్వారా క్యూఆర్‌ కోడ్‌ రసీదులు తీసుకుని దానిని నగదు రవాణా చేసే వాహనంతో పాటు వచ్చే అధికారికి అందజేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ ఎం.సూర్యకిరణ్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజనల్‌ మేనేజర్‌ ఎం.వి.తిలక్‌, డిసిసిబి సిఇఒ వరప్రసాద్‌, గ్రామీణ వికాస్‌ బ్యాంకు ఆర్‌ఎం రాఘవేంద్ర పాల్గొన్నారు. ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిజిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు, లౌడ్‌స్పీకర్లకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినా, ప్రచారాలకు వినియోగించే వాహనాలకు, వీధుల్లో నిర్వహించే సమావేశాల లౌడ్‌స్పీకర్స్‌, సభా వేదిక, బారీకేడ్లు ఏర్పాటు చేసినా, అంతర్జిల్లాలలో తిరిగే వాహనాలు, ఇంటింటా ప్రచారానికి, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు ఒక వాహనానికి నియోజకవర్గంలో తిరగడానికి తీసుకున్న అనుమతి ఆ నియోజకవర్గంలో తిరగడానికి మాత్రమే ఆ వాహనాన్ని వినియోగించాలన్నారు. లౌడ్‌స్పీకర్లతో ఉన్న వాహనాలకు, పోస్టర్ల పంపిణీకి, బేనర్లు, పార్టీ జెండాలు పెట్టేందుకు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో అనుమతులు కావాలంటే 48 గంటలు ముందు లిసువిధలిలో ఏప్‌లో, ఆఫ్‌లైన్‌లో సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసి 24 గంటల్లో అనుమతి పొందవచ్చన్నారు. ఆయా రాజకీయ పార్టీలు గమనించి పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

 

➡️