ఎన్నికల నియమావళిపై అవగాహన

ఎన్నికల నియమావళి, సమాచార సాంకేతికతలపై

మాట్లాడుతున్న సిపిఒ లకీëప్రసన్న

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఎన్నికల నియమావళి, సమాచార సాంకేతికతలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సిపిఒ, మాస్టర్‌ ట్రైనర్‌ లకీëప్రసన్న అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి (ఎఎల్‌ఎంటి) మాస్టర్‌ ట్రైనర్స్‌ శిక్షణా తరగతుల్లో మాస్టర్‌ ట్రైనర్స్‌, జెడ్‌పి డిప్యూటీ సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌ ఎంసిసి, ఐటిలపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులు, ఎన్నికల నియమావళిపై ఎఎల్‌ఎంటిల నిర్వహణ అత్యంత కీలకమన్నారు. ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్‌ ఉండదని, ఎన్నికల నియమ నిబంధనలే కీలకమని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి పథకాల పేర్లు, రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు కనిపించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ నిర్వహించాల్సిన విధులు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మాక్‌ పోలింగ్‌పై ఎఎల్‌ఎంటిలకు బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వివి ప్యాడ్‌లపై వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ఇవిఎంలపై అసెంబ్లీ లెవల్‌ మాస్టర్‌ ట్రైనర్స్‌కు మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ రామ్మోహనరావు, అసెంబ్లీ లెవల్‌ మాస్టర్‌ ట్రైనర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️