ఎస్‌పికి డిజిపి డిస్క్‌ అవార్డు

రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో-2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ నుంచి అడిషనల్‌ డిజిస్థాయి అధికారులకు రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం డిజిపి ప్రధాన పోలీస్‌ కార్యాలయం మంగళగిరిలో డిజిపి డిస్క్‌ అవార్డులను ప్రదానం

అవార్డును అందుకుంటున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి- శ్రీకాకుళం

రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో-2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ నుంచి అడిషనల్‌ డిజిస్థాయి అధికారులకు రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ కె.రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం డిజిపి ప్రధాన పోలీస్‌ కార్యాలయం మంగళగిరిలో డిజిపి డిస్క్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్‌పి జి.ఆర్‌ రాధిక జిల్లాలోను క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అందుకు గాను అందించిన సేవలను గుర్తించిన డిజిపి డిజిపి డిస్క్‌ అవార్డును అందజేసి అభినందించారు. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ వారిచే అవార్డును అందుకోవడం చాలా సంతృప్తికరంగా అంశమని, ఈ అవార్డును నేను అందుకోవడం ద్వారా జిల్లా పోలీస్‌ శాఖ మరింత ఉత్సాహంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి దోహదపడుతుందని ఎస్‌పి రాధిక పేర్కొన్నారు.

 

➡️