ఐతమ్‌కు ‘ఇషుజు’ ఇంజిన్‌ కానుక

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఆటోమొబైల్‌ రంగంలో దిగ్గజ కంపెనీ ఇషుజు మోటార్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 'కట్‌ సెక్షన్‌ ఇంజిన్‌'ను సిఎస్‌ఆర్‌ యాక్టివిటీలో భాగంగా కానుకగా అందజేసిందని కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఇషుజు ఇంజిన్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016

పరిశీలిస్తున్న నాగేశ్వరరావు

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఆటోమొబైల్‌ రంగంలో దిగ్గజ కంపెనీ ఇషుజు మోటార్స్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ‘కట్‌ సెక్షన్‌ ఇంజిన్‌’ను సిఎస్‌ఆర్‌ యాక్టివిటీలో భాగంగా కానుకగా అందజేసిందని కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఇషుజు ఇంజిన్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2016 నుంచి ఈ కంపెనీకి ఏటా కనీసం 30 మందికి తక్కువ లేకుండా ఐతమ్‌ విద్యార్థులు ఇంటర్నిషిప్‌కు వెళ్లడం, ఉద్యోగాల్లో చేరడం వల్ల ఇషుజు కంపెనీతో సంబంధాలు కొనసాగుతున్నా యని అన్నారు. ఈ నేపథ్యంలో డిప్లొమో మెకానికల్‌, బిటెక్‌ మెకానికల్‌ విద్యార్థులకు, ఫ్యాకల్టీకి, ప్రయోగాత్మకంగా ఇంజిన్‌పై అధ్యయనం చేసే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఇంజిన్‌ డిజైన్‌తో పాటు ఇతర అంశాలను ప్రత్యక్షంగా ల్యాబ్‌లోనే తెలుసుకొనే వీలుంటుందని పేర్కొన్నారు. ఇషుజు కట్‌ సెక్షన్‌ ఇంజిన్‌ అందజేసిన వారిలో ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ మిట్టల్‌, డిజిఎం కె.వేణుగోపాల్‌, మేనేజర్లు శివకుమార్‌, శుక్లా మురళి, డిప్యూటీ మేనేజర్‌ హెస్‌ఆర్‌ ఎస్‌.నరేష్‌, కార్పొరేట్‌ ప్లానింగ్‌ రుమట్‌ సునాగాల, ఐతమ్‌ కోశాధికారి టంకాల నాగరాజు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, డీన్‌ ఆరెన్డీ డాక్టర్‌ డి.ఆజాద్‌, మెకానికల్‌ విభాగం నుంచి హెచ్‌ఐడి డాక్టర్‌ డి.శ్రీరాములు, అసిస్టెంట్‌ హెచ్‌ఐడి డాక్టర్‌ శ్రీహరి, డిప్లొమో డిప్యూటీ డైరెక్టర్‌ బి.ఎస్‌.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్‌ అధికారి డాక్టర్‌ ఎం.వి.సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

➡️