‘ఐతమ్‌’లో ముగిసిన శిక్షణా తరగతులు

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఇసిఇ విభాగం

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న అవినాష్‌

ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌

టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో ఎఐసిటిఇ ట్రెయినింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ (ఎటిఎల్‌) అకాడమి సహకారంతో స్పీచ్‌సిగల్‌ ప్రాసెసింగ్‌ యూజింగ్‌ మిషన్‌ లెర్నింగ్‌ ఆల్గోరితమ్స్‌’ అనే అంశంపై ఈనెల 12 నుంచి వారంరోజుల పాటు జరిగే అధ్యాపక శిక్షణా తరగతులు శనివారంతో ముగిసినట్టు కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.వి.నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. సెంచూరియన్‌ యూనివర్శిటీ ఛాన్సర్‌ ప్రొఫెసర్‌ జి.ఎస్‌.ఎన్‌.రాజు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సులను ప్రారంభించగా ఐఐఐటి హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌ ఉప్పల, ఎస్‌ఐటి వరంగల్‌ ప్రొఫెసర్‌ టి.కిషోర్‌ కుమార్‌, డాక్టర్‌ డి.విష్ణుమూర్తి, డాక్టర్‌ కె.కిరణ్‌ కుమార్‌ పాత్రో, డాక్టర్‌ జి.యోగేశ్వరరావులు ఈ సదస్సులకు హాజరై పలు అంశాలపై అధ్యాపకులకు అవగాహన కలిగించారన్నారు. ఎఫ్లో భాగంగా నిర్మాణంలో ఉన్న మూలపేట ఫిషింగ్‌ హార్జర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎఫ్‌ఎపి ముగింపు సందర్భంగా నాగపూర్‌ విఎస్‌ఐటి ప్రొఫెసర్‌ అవినాష్‌ కేస్కర్‌ పాల్గొని అనేక అంశాలపై అవగాహన కల్పించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, డీన్‌ డాక్టర్‌ డి.ఆజాద్‌, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.జయ మన్మధరావు, ఇసిఇ హెచ్‌ఐడి, ఎఫ్‌ఎపి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.రామారావు, కో-కోఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జయ, ఆర్గనైజింగ్‌ కో-కోఆర్డినేటర్లుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఎ.జయలక్ష్మి, జె.స్వాతి పాల్గొన్నారు.

 

➡️