ఓటర్ల జాబితాలో సవరణలకు 10,304 దరఖాస్తులు

ఓటర్ల జాబితాలో

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ గణపతిరావు

  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా తదితర సవరణల కోసం ఇప్పటివరకు 10,304 దరఖాస్తులు వచ్చాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మార్పులు, చేర్పుల కోసం 4,227 దరఖాస్తులు అందాయన్నారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 31వ వారపు సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తాజాగా వచ్చిన ఫారం 6, 7, 8ను పరిశీలించి సప్లిమెంటరీ ఓటరు జాబితాలో చేరుస్తామన్నారు. డిసెంబరు 12 నుంచి ఇప్పటివరకు 12,267 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిని సప్లమెంటరీ జాబితాలో చేర్చనున్నట్లు తెలిపారు. చిరునామా, పేరు, ఇతర సవరణలు కోరుతూ 10,304 మంది దరఖాస్తు చేసుకున్నారని వీటిలో 454 తిరస్కరించగా, 4,424 పెండింగ్‌లో ఉన్నాయని మిగిలిన వాటిని ఆమోదించామన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు కె.వి రామరాజు, కాంగ్రెస్‌ నాయకులు డి.మల్లిబాబు, బిజెపి నాయకులు సురేష్‌బాబు సింగ్‌, బిఎస్‌పి నాయకులు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️