ఓటు హక్కుపై అవగాహన

ఓటుహక్కు వినియోగంపై ఎంపిడిఒ జి.శివప్రసాద్‌ ఆధ్వర్యంలో

నందిగాం : ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామైక్య సంఘ సభ్యులు

ప్రజాశక్తి- నందిగాం

ఓటుహక్కు వినియోగంపై ఎంపిడిఒ జి.శివప్రసాద్‌ ఆధ్వర్యంలో మండలంలోని సొంటినూరు, రాంపురం, పెద్ద తామరపల్లిలో అవగాహన సదస్సులు, ర్యాలీలు, మానవహారం చేపట్టి ఓటర్లలో చైతన్యం నింపేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యదర్శులు చంద్రశేఖరరావు, సంతోష్‌ కుమార్‌, అంగన్వాడీలు, ఆశ, సచివాలయ సిబ్బంది, గ్రామైఖ్య సంఘ సభ్యులు, సిఎఫ్‌లు, సిసిలు పాల్గొన్నారు. ఆమదాలవలస: మండల పరిధిలో బెలమాం, కొత్తవలస, కొర్లకోట గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ పైడి కూర్మారావు ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి మహిళలకు అవగాహన కల్పించారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మహిళలు శతశాతం ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వెలుగు క్లస్టర్‌ కో-ఆర్డినేటర్‌ మామిడి చందర్రావుతో పాటు అధ్యక్షులు వాకముళ్ల సుశీల, విఒఎ పావని, గ్రామ సంఘం లీడర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కొత్తూరు: మండల మహిళా సమైఖ్య, వెలుగు ఆధ్వర్యంలో నివగాం, కర్లెమ్మ గ్రామాల్లో అర్హులైన ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎపిఎంలు పార్వతి, జనార్డన ప్రజలకు అవగాహన కల్పించారు. పురవీధుల్లో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిసి జ్యోతి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.కవిటి: ఓటు వజ్రాయుధమని, ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్‌ శాతం పెంచాలని ఎపిఎం గోవిందరావు అన్నారు. మండలంలోని బల్లిపుట్టుగ, కుసుంపురం గ్రామాల్లో సోమవారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️