కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌

సంక్రాంతి పండగ సీజన్‌

ఆర్‌టిసికి ‘పండగ’

  • 624 ప్రత్యేక బస్సుల ద్వారా రూ.1.21 కోట్ల ఆదాయం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

సంక్రాంతి పండగ సీజన్‌ ఆర్‌టిసికి కలిసొచ్చింది. సాధారణ రోజుల్లో తిరిగే బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలకు వేసిన ప్రత్యేక బస్సులతో భారీగా ఆదాయం వచ్చింది. ఆదాయం పెంపునకు ఆర్‌టిసి ఈసారి చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలించాయి. పండగ సీజన్‌లో సాధారణంగా అదనపు ఛార్జీలు వసూలు చేసే పరిస్థితి ఉండగా, ఈ ఏడాది సాధారణ ఛార్జీలతోనే బస్సులను నడిపింది. దీంతోపాటు రానుపోనూ టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే పది శాతం రాయితీ సైతం కల్పించింది. దీంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్‌టిసిలో ప్రయాణించేందుకు మొగ్గు చూపడంతో ఆర్‌టిసి గల్లా పెట్టె కాసులతో గలగలాడింది.జిల్లాలో సాధారణ రోజుల్లో 350 బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి ఏడాదీ సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ఏడాది జనవరి పది నుంచి జనవరి 22వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపింది. జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 624 బస్సులను తిప్పారు. దీని ద్వారా రూ.1,21,20,975 ఆదాయం సమకూరింది. శ్రీకాకుళం-1 డిపో ద్వారా అత్యధికంగా రూ.35,55,908 ఆదాయం వచ్చింది. ఆర్‌టిసి వైపు ప్రయాణికులు పజలు మొగ్గు చూపడంతో ప్రయివేట్‌ ట్రావెల్స్‌, బస్సుల్లో రద్దీ బాగా తగ్గింది. దీంతో వారూ సాధారణ ధరలకే ప్రయాణికులను ఎక్కించుకున్నారు. మొత్తమ్మీద ఆర్‌టిసి చర్యలతో ప్రయివేట్‌ ట్రావెల్స్‌, బస్సుల దోపిడీకి కొంత అడ్డుకట్ట వేసినట్లయింది.ఆదాయం పెరగడం ఆనందంగా ఉందిపండగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలురూట్లలో ప్రత్యేక బస్సులను నడిపాం. సాధారణ ఛార్జీలు వసూలు, రానుపోనూ రిజర్వేషన్‌ టిక్కెట్లపై రాయితీ వంటి చర్యలతో ప్రజలు ఆర్‌టిసిని ఆదరించారు. ఆర్‌టిసి ఈ ఏడాది మంచి ఆదాయం రావడం ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లోనూ ఆర్‌టిసి ఆదాయం పెంచడంతో, ప్రజలు ఆర్‌టిసి వైపు మొగ్గు చూపేలా మరిన్ని చర్యలు చేపడతాం.- ఎ.విజరుకుమార్‌, జిల్లా ప్రజారవాణా అధికారిడిపోల వారీగా వచ్చిన ఆదాయ వివరాలుడిపో బస్సులు ఆదాయం (రూపాయల్లో)శ్రీకాకుళం-1 179 35,55,908శ్రీకాకుళం-2 169 30,63,082టెక్కలి 119 25,20,806పలాస 157 29,81,179మొత్తం 624 1,21,20,975

➡️