కలెక్టర్‌గా మనజిర్‌ జిలానీ సమూన్‌

జిల్లా కలెక్టర్‌గా డాక్టర్‌ మనజిర్‌ జిలానీ సమూన్‌

మనజిర్‌ జిలానీ సమూన్‌

పురపాలక కమిషనర్‌, ఎమ్‌డిగా శ్రీకేష్‌ లాఠకర్‌ బదిలీ

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లా కలెక్టర్‌గా డాక్టర్‌ మనజిర్‌ జిలానీ సమూన్‌ నియమితులయ్యా రు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ… ప్రభుత్వం ఆదివారం జిఒ నంబరు 172ను విడుదల చేసింది. అందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఈయనను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసింది. ఇప్పటి వరకు పనిచేసిన కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌గా నియమించింది. మనజిర్‌ జిలాని సమూన్‌ 2012 బ్యాచ్‌కు చెందిన నాగాల్యాండ్‌ కేడర్‌ ఐఎఎస్‌ అధికారి. ఈయన గతంలో విశాఖపట్నం మెట్రోరీజియన్‌ డెవప్‌మెంట్‌ అథారిటీ (విఎం ఆర్‌డిఎ) అధికారిగా పనిచేశారు. 2021 ఏప్రిల్‌లో కర్నూలు జిల్లా గ్రామ, వార్డు సచివాలయ, అభివృద్ధి జెసిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాల పునవ్యవస్థీకరణ అనంతరం ఏప్రిల్‌ 5, 2022లో నంద్యాల జిల్లాకు తొలి కలెక్టర్‌గా నియమితుల య్యారు. ఈయన సతీమణి ఎ.తమీమ్‌ అన్సారియా కూడా ఐఎఎస్‌ అధికారి. బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.

 

➡️