కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

పట్టణంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్దార్‌ కార్యాలయానికి

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ఆమదాలవలస :

పట్టణంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఇటీవల నిర్వహించిన జగనన్న భూ రీ సర్వే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్థానిక జూనియర్‌ కళాశాల వద్ద ఉన్న పోలింగ్‌ కేంద్రంతో పాటు డిస్టిబ్యూషన్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూములను పరిశీలించారు. అనంతరం మౌనం వారి వీధిలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను సందర్శించి హాజరు పట్టికను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మండలంలోని జొన్నవలస సమీపంలో ఉన్న సిహెచ్‌సి 30 పడకల ఆస్పత్రిని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఓపి వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు చికిత్స పొంది ఉన్న రోగులను పరామర్శించి వైద్య సేవలు అందుతున్న తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌, తహశీల్దార్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ రాంబాబు, ఎన్నికల డిటి మురళీధర్‌ నాయక్‌, మండల సర్వేయర్‌ బొడ్డేపల్లి గోపి, వైద్యులు ట్రాక్టర్‌ డి.సురేష్‌, హరిణి ఉన్నారు. వైద్య సిబ్బందితో

➡️