కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌కు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ కళింగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దుంపల రామారావు (లక్ష్మణరావు) ఇటీవల

స్వాగతం పలుకుతున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఆంధ్రప్రదేశ్‌ కళింగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దుంపల రామారావు (లక్ష్మణరావు) ఇటీవల నియమితులయ్యారు. ఇటీవల సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలిసి తొలిసారిగా జిల్లాకు బుధవారం చేరుకున్నారు. పైడిభీమవరం వద్ద అభిమానులు 200 కార్లతో ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా చిలకపాలెం, లోలుగు, పొందూరు, రాపాక మీదుగా తన స్వగ్రామమైన తోలాపి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిసి అక్కడ నుంచి నగరంలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ముందుగా సింహద్వారం వద్ద ఉన్న మాజీ ఎంపీ, కీర్తీశేషులు బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళ్లర్పించారు. పొందూరు మండలం తోలాపికి చెందిన రామారావు రెండు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ జిల్లా నేతగా వ్యవహరించారు. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఆల్‌ ఇండియా బ్యాంక్‌ వర్డ్‌ క్లాసెస్‌ ఫెడరేషన్‌ (ఎఐబిసిఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బిసిల సమస్యలపై పోరాటం సాగించారు.జగన్‌ అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించి కళింగుల ప్రయోజ నం చేకూర్చేందుకు కృషి చేస్తానని అన్నారు.

➡️