కిడ్నీ వ్యాధి నివారణపై దృష్టి

ఉద్దానం కిడ్నీ వ్యాధి నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షతన జిల్లా

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఉద్దానం కిడ్నీ వ్యాధి నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షతన జిల్లా కోర్టులోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పర్యవేక్షించడానికి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు. నెఫ్రాలజిస్టులు డాక్టఉ్ల కిడ్నీ వ్యాధి బారిన పడిన ప్రజలకు మనో ధైర్యం కల్పించి సరైన వైద్యం అందించాలన్నారు. అలాగే రెవెన్యూ సిబ్బంది సకాలంలో వారికి ప్రభుత్వం నుంచే పొందే పించను అందించాలన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఉద్దానం ప్రాంతంలోని ఫ్యాక్టరీలు నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులను ఆకస్మికంగా తనిఖీ చేపట్టి నాణ్యతలేని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే వారిపై దృష్టిసారించాలన్నారు. నాణ్యత లోపిస్తే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు ఎవరు విచక్షణ రహితంగా అమ్మకూడదని వ్యాపారులకు సూచించారు. త్వరలో ప్రారంభం కానున్న పలాసలోని 200 పడకల ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌కు తగిన సమాచారం అందించి ఉద్దానంలోని కిడ్నీ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే కిడ్నీ వ్యాధిని ఉద్దానం ఏరియా నుంచి రూపుమాపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆర్‌.సన్యాసినాయుడు, డిస్ట్రిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్‌ గణపతి, సోంపేట మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఇన్‌ఛార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ప్రసాదరావు, డ్రగ్‌ కంట్రోల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.చంద్రరావు, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ శ్రీరాములు, నెఫ్రాలజిస్టు డాక్టర్‌ విద్యాసాగర్‌, డిప్యూటీ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ భానుప్రకాష్‌, డాక్టర్‌ ప్రవీణ్‌రెడ్డి, ల్యాబ్‌ల ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.సురేష్‌, నెఫ్రో కేర్‌ సెంటర్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.పోటో: మాట్లాడుతున్న

 

➡️