కులగణనపై రౌండ్‌టేబుల్‌ సమావేశం

మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపిడిఒ ఆర్‌వి.రమణమూర్తి అధ్యక్షతన కులగణన మండలస్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం

రణస్థలం : మాట్లాడుతున్న ఎంపిడిఒ రమణమూర్తి

ప్రజాశక్తి- రణస్థలం

మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపిడిఒ ఆర్‌వి.రమణమూర్తి అధ్యక్షతన కులగణన మండలస్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కులాలవారీగా అధికారిక సర్వే కులగణనకు ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్రమంలా ఈ సర్వే మొదలు పెట్టేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వే పక్కాగా చేపట్టాలని, కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కులగణన సర్వేపై ప్రతిఒక్కరు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, చిన్నపాటి పొరపాట్లకు తావివ్వకుండా వారంరోజుల వ్యవధిలో ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని సూచించారు. కులగణన సర్వేలో సంబంధిత శాఖల అధికారులు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి సాయికుమార్‌, జెడ్‌పిటిసి టి.సీతారాం పాల్గొన్నారు.కుల గణన బాధ్యతగా చేయాలిపలాస: ఈ నెల 9 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కుల గణన బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌నాయుడు అధ్యక్షతన కుల గణనపై బుధవారం అవగాహనా కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భూముల రీ సర్వేతో సత్ఫలితాలను ఇస్తోందని వివరించారు. ఆరోగ్య సురక్ష పేరుతో ప్రజారోగ్యంపై సర్వే చేసి ఆరోగ్య కార్డులను అందజేస్తుందని అన్నారు. ఇఒపిఆర్‌డి, సర్పంచ్‌ నీలవతి, సర్పంచ్‌ ప్రతినిధి తిరుపతిరావు, చినంచల, గురుదాస్‌పురం, బొడ్డపాడు ఎంపిటిసిలు బమ్మిడి దుర్యోధన, షణ్ముఖరావు, పాపారావు పాల్గొన్నారు.

 

➡️