కుల గణనకు సహకరించాలి

కుల గణనకు ప్రజలందరూ సహకరించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. నగరంలోని పెద్దపాడులో కుల గణన కార్యక్రమాన్ని

కుల గణనను ప్రారంభిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

కుల గణనకు ప్రజలందరూ సహకరించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. నగరంలోని పెద్దపాడులో కుల గణన కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆర్థిక పరిస్థితులు, కులాల వారీగా ఎంతెంత శాతం ఉన్నారన్న వివరాలు కుల గణన ద్వారా తెలుస్తాయన్నారు. ప్రభుత్వాలు ఆయా కులాల ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను కులాల సహాయ సామాజిక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు కోసం జనాభా ప్రాతిపదికన అవసరమైన బడ్జెట్‌ కేటాయింపునకు ఈ గణన ఉపయోగపడుతుందన్నారు. పది రోజులు పాటు చేపట్టే ఈ గణనలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కుటుంబ వివరాలను సేకరించడానికి ఇంటింటికీ వస్తారని తెలిపారు.

 

➡️