కూలేందుకు సిద్ధంగా వంతెన

టెక్కలి, మెళియాపుట్టి రోడ్డులో గల సన్యాశినీలాపురం గ్రామం వద్ద ఉన్న వంతెన కూలేందుకు సిద్దంగా ఉంది. వంశధార 48ఆర్‌ మెయిన్‌ కెనాల్‌ మీద

కూలేందుకు సిద్ధంగా ఉన్న వంతెన

ప్రజాశక్తి- టెక్కలి

టెక్కలి, మెళియాపుట్టి రోడ్డులో గల సన్యాశినీలాపురం గ్రామం వద్ద ఉన్న వంతెన కూలేందుకు సిద్దంగా ఉంది. వంశధార 48ఆర్‌ మెయిన్‌ కెనాల్‌ మీద దశాభ్దాల క్రితం నిర్మించిన వంతెనపై నుంచి భారీ వాహనాలు తిరగడంతో వంతెన కిందభాగం శిధిలావస్థకు చేరుకుంది. మూలపేట పోర్టు నిర్మాణం దృష్ట్యా రాళ్లు లోడుతో వెళ్తున్న భారీ వాహనాలు రోజుకు పదుల సంఖ్యల్లో తిరగడంతో వాటి బరువుకు వంతెన మరామ్మతులకు గురైంది. కాగా ఈ వంతెన కూలితే నౌపడా, మెళియాపుట్టి మార్గంలో రాకపోకలు స్తంభించుకుపోయినట్లే. ఒడిషా రాష్ట్రం పర్లాకిమిడి వెల్లడానికి కూడా ఇదే ప్రధాన మార్గం కావడంతో వంతెన శిధిలావస్దపై ఈ ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వంతెన మార్గం దెబ్బతింటే ఈ మార్గం ద్వారా పలు గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోతాయి. ప్రతీ చిన్న విషయానికి నిత్యం టెక్కలి వచ్చే గ్రామాల ప్రజలకు వంతెన అనుకూలంగా ఉంటుంది. వంతెన పైభాగంలో భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వలన రోడ్డు దెబ్బతిని ఇసుక చేరి వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము, దూళి రేగి తీవ్ర ఆసౌకర్యం కలుగుతుందని, వాహనాలు రాకపోకలు సందర్భంగా రేగిన దూళి వలన ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతుందని ప్రజలు వాపోతున్నారు. వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిషేదించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రహదారులు, భవనాల శాఖాధికారులు, వంశధార శాఖాధికారులు స్పందించి వంతెనపై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేదించాలని కోరుతున్నారు.

 

➡️