కేన్సర్‌ రహిత సమాజ నిర్మాణం అవసరం

కేన్సర్‌ రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరముందని లయన్స్‌క్లబ్‌ సెంట్రల్‌ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్‌ అభిప్రాయపడ్డారు. బుధవా రం నగరంలో హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్లో చైల్డ్‌ హుడ్‌ కేన్సర్‌ పట్ల అవగాహన సదస్సు

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కేన్సర్‌ రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరముందని లయన్స్‌క్లబ్‌ సెంట్రల్‌ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్‌ అభిప్రాయపడ్డారు. బుధవా రం నగరంలో హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్లో చైల్డ్‌ హుడ్‌ కేన్సర్‌ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా సిందూర ఆస్పత్రి సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ పైడి మాలతి, పైడి సిందూర హాజరై కేన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికు మార్‌ హాజరై మాట్లాడుతూ పిల్లలకు చిన్నపాటి జ్వరం వచ్చిందంటేనే తల్లిదండ్రులు తట్టుకోలేరని, అటువంటి స్థితిలో కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధి ఉందని గుర్తిస్తే తల్లడిల్లి పోతారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ఆధారంగా ఏటా దాదాపు 75,000 మంది పిల్లలు క్యాన్సర్‌ బారిన పడుతున్నారని గుర్తుచేశారు. వారిలో 20శాతం పిల్లలు భారత్‌లో నమోదవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పద్నాలుగేళ్లలోపు వారిలో వచ్చే వాటిని చైల్డ్‌హుడ్‌ కేన్సర్లు పూర్తిగా నయం చేయదగినవేనని నిపుణులు చెబుతున్నారని, అందువల్ల వీటి పట్ల అవగాహన ఉంటే మొదటి దశలోనే వీటిని నయం చేసుకోవచ్చన్నారు. ఈ సదస్సులో స్కూల్‌ డైరెక్టర్‌ అన్నెపు రమేష్‌బాబు, ప్రిన్సిపాల్‌ కిరణ్‌ కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ మెంటార్‌ నటుకుల మోహన్‌, జోన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బాడాన దేవభూషనరావు, సెక్రట రీ రామ్‌ గోపాల్‌, ట్రెజరర్‌ శిల్లా మణి, సభ్యులు కామేష్‌, లయన్‌ తిరుమలరావు పాల్గొన్నారు.

 

➡️