ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

ఎటువంటి ఆర్థిక స్థోమత లేక సరైన న్యాయం పొందలేక క్రిమినల్‌

మాట్లాడుతున్న సన్యాసినాయుడు

న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సన్యాసినాయుడు

శ్రీకాకుళం అర్బన్‌ :

ఎటువంటి ఆర్థిక స్థోమత లేక సరైన న్యాయం పొందలేక క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేదుకు ఉచిత లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సన్యా సినాయుడు తెలిపారు. సంస్థ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. జాతీయ లీగల్‌ సర్వీస్‌ ఆథారిటీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నాయయస్థానాల్లో ఈ కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో ఉన్న ఖైదీలకు ఈసెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుం దన్నారు. న్యాయసాయం కోసం ఎదురు చూస్తున్న పేద ఖైౖదీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయవాది ఇందిరాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️