గ్రామాభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ

పంచాయతీల వారీగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపిపి డాక్టర్‌ ఎం.దాసు కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో

సోంపేట : మాట్లాడుతున్న ఎంపిపి దాసు

సోంపేట :

పంచాయతీల వారీగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపిపి డాక్టర్‌ ఎం.దాసు కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం సర్పంచ్‌లతో, కార్యద ర్శులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల, ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ నివేదికలను పంపించి పంచాయతీలకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ బి.వెంకటరమణ, వెంకటేశ్వరరావు, మండల ఎఒ భాస్కరరావు పాల్గొన్నారు. పోలాకి : మండలంలోని పంచాయతీ అభివృద్ధి పనులపై నిర్ధిష్టమైన ప్రణాళికలు ఉండాలని మండల పరిషత్‌ ప్రత్యేక సలహారులు ముద్దాడ భైరాగినాయుడు సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లతో, ఎంపిటిసిలతో, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25 ఏడాదికి ప్రతి పంచాయతీలో ప్రజలకు అవసరమైన పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మీరు సూచించిన పనులకు అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తామని భరోసానిచ్చారు. వైస్‌ ఎంపిపి కోట అప్పారావు, సూపరింటెండెంట్‌ బి.సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌: టెక్కలి మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధిపై సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు ఎంపిడిఒ చింతాడ లక్ష్మీబాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బందికి ఎఒ హెచ్‌.విరమణమూర్తిలు పలు అంశాలపై అవగాహన కల్పించారు.నౌపడ: సంతబొమ్మాళి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ ఉమా సుందరి ఆధ్వర్యా న గ్రామాభివృద్ధి ప్రణాళికలపై మండలస్థాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీలో చేపట్టబోయే పనులు, వాటి ప్రణాళిక, అమలు చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో మండలంలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు. మెళియాపుట్టి : స్థానిక మండల పరిషత్‌ కార్యాల యంలో సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరుకుమార్‌, ఇఒపిఆర్‌డి తారకేశ్వరి, ఎంపిడిఒ ఇఒ తిరుపతి పట్నాయక్‌ పాల్గొన్నారు.

 

➡️