గ్రామాల అభివృద్ధికి ఎఎంసి నిధులు ఇవ్వాలి

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మళ్లించే విధంగా ప్రత్యేక జిఒను ఇవ్వాలని

మాట్లాడుతున్న ప్రసాదరావు

కోటబొమ్మాళి: వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మళ్లించే విధంగా ప్రత్యేక జిఒను ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. స్థానిక ఎఎంసి కమిటీ అధ్యక్షలు సుగ్గు పుణ్యవతి నేతృత్వంలో కార్యదర్శి వి.ఎస్‌.వి.ఆర్‌.ప్రసాదరావు గురువారం కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ ఎఎంసికి రవాణా, వ్యవసాయ ఉత్పత్తులపై, అక్రమ రవాణాలపై వేసిన జరిమానాలు, రైస్‌ మిల్లుల చెస్‌ల ద్వారా వసూళ్లు చేసిన నిల్వ రూ.9.50 కోట్లు ఉందని అన్నారు. అయితే ఇది కేవలం ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు జీతాలు ఈ ప్రాంగణంలో నిర్మించే భవనాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉందని అన్నారు. ఈ నిధులు ఇతరాత్ర అవసరాలకు, అభివృద్ధి పనులు ఇచ్చేందుకు ఎటువంటి అధికారులు లేవని, అవసరమైతే అటువంటి జిఒలు ప్రభత్వం నుంచి తీసుకురావాలని కార్యదర్శి వివరించారు. ఈ మేరకు కమిటీ స్పందిస్తూ… అయితే కమిటీలు ఎందుకని, ఏమి చేశామని ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని చర్చించుకొని ఈ నిధులు గ్రామాల్లో లింకురోడ్డు, లింకు రోడ్లు మరమమ్మతులు, కాలువ పూడికల తీతలు, మదుముల మరమ్మతులకు ఉపయోగ పడేలా జిఒలు ఇవ్వాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ తీర్మాణాన్ని జనవరి మొదటి వారంలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు సుగ్గు రామిరెడ్డి, ఉపాధ్యక్షులు బొడ్డు వెంకటరమణమూర్తి, బాస్కరరెడ్డి, మెట్ట శాంతరావు, కె.కృష్ణారావు పాల్గొన్నారు.

 

➡️