ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు జన్మదిన వేడుకలను నగరంలో 80అడుగుల రోడ్డులో ప్రజాసదన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, నియోజకవర్గ పరిశీలకులు

శ్రీకాకుళం అర్బన్‌ : లకీదేవికి కేక్‌ తినిపిస్తున్న కార్యకర్తలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు జన్మదిన వేడుకలను నగరంలో 80అడుగుల రోడ్డులో ప్రజాసదన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ హాజరై అభిమానులు, పార్టీ నాయకుల నడుమ కేక్‌కట్‌ చేశారు. అనంతరం నగరంలో రక్తదాన శిబిరం, వివిధ అనాథ శరణాలయాల్లో అన్న వితరణ, ప్రభుత్వ సర్వజనా సుపత్రిలో రోగులకు పండ్లు, మిఠాయిలు పంచి పెట్టారు. నగరంలో ఏడురోడ్ల కూడలిలో జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్‌ ఆధ్వర్యాన పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. టిడిపి నాయకులు, మెండ దాసునాయుడు, నగర టిడిపి అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, పార్టీ నాయకులు బోయిన గోవిందరాజులు, సింతు సుధాకర్‌, జామి భీమశంకరరావు, కొర్ను నాగార్జున ప్రతాప్‌, చిట్టి మోహన్‌, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, శీర రమణ, గుండ భాస్కరరావు, గొండు వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. ఆమదాలవలస : ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో రైల్వేస్టేషన్‌ ఆవరణలో కేక్‌నుకట్‌ చేసి పలువురికి పంచిపెట్టారు. టిడిపి సీనియర్‌ నాయకుడు బోర గోవిందరావు మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని దేశ రాజధానిలో నలు దిశల వ్యాపింపజేసిన వ్యక్తి రామ్మోహన్‌ నాయుడని కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బివి.రమణమూర్తి, లంక నాగరాజు, ఎన్ని శ్రీదేవి, దవల అప్పలనాయుడు పాల్గొన్నారు.సరుబుజ్జిలి : మండల కేంద్రంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకును కట్‌ చేసి పలువురికి పంచిపెట్టారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి శివాల సూర్యనారాయణ, మండల టిడిపి అధ్యక్షులు అంబల రాంబాబు, జిల్లా తూర్పుకాపు సాధికార నాయకులు పల్లి సురేష్‌, టిడిపి నాయకులు కొర్ను సూర్యనారాయణ, కొమనాపల్లి రవికుమార్‌, దవల సింహాచలం, తాడేల వెంకటరమణ, లావేటి పూర్ణారావు, దొరబాబు పాల్గొన్నారు.బూర్జ: మండల కేంద్రమైన బూర్జలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పుట్టినరోజు వేడుకలు మండల పార్టీ అధ్యక్షులు సీతారాంబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపిపి వీరుకట్ల ప్రభాకరరావు, సీతబాబు, సర్పంచ్‌ లంక జగన్నాథం, కృష్ణ గిరి, పోలి నాయుడు పాల్గొన్నారు.కవిటి: ఎంపీ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. బెజ్జిపుట్టుగ చక్ర పెరుమాళ్‌ ఆలయంలో జెడ్‌పిటిసి మాజీ సభ్యుడు పి.కృష్ణారావు కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. పలాస : పలాస టిడిపి కార్యాలయంలో ఎంపీ జన్మదిన సందర్భంగా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కేక్‌ను కట్‌ చేసి మిఠాయి పంచిపెట్టారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, బి.నాగరాజు, మల్లా శ్రీనివాసరావు, డొక్క శంకర్‌, అంబటి కృష్ణమూర్తి పాల్గొన్నారు. మందస : మండలంలోని హరిపురం టిడిపి కార్యాలయంలో ఎంపీ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు దాసరి తాతారావు, బావన దుర్యోధన, లబ్బ రుద్రయ్య, రట్టి లింగరాజుపోలాకి : ఎంపీ జన్మదినం సందర్భంగా పోలాకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎం.వెంకట అప్పలనాయుడు, లుకలాపు రాంబాబు, అప్పలరెడ్డి, ముప్పిడి సింహాచలం, దంత సింహాచలంపాల్గొన్నారు. మెళియాపుట్టి : మండలంలోని జలకలింగుపురంలో ఎంపీ జన్మదిన సందర్భంగా స్థానిక సర్పంచ్‌ రవ్వల అనురాధ, ప్రతినిధి గణపతిరావు కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్‌ గౌడ, మండల ప్రధాన కార్యదర్శి ఉర్లాన వసంత్‌, మండల జనసేన నాయకులు దుక్క బాలరాజు, రవ్వల దుర్గారావు, సౌందర్య, ఆనందరావు, శంకర్‌, అప్పారావు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుని టిడిపి నాయకులు కాళ్ల ధర్మారావు, సాలీనా ఢిల్లీ యాదవ్‌, నందిక జాని, దక్కత ఢిల్లీరావు, కొండ శంకర్‌రెడ్డి, లీలారాణి, పద్మనాభం కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. కొత్తూరు : స్థానిక కలమట కాంప్లెక్స్‌లో ఎంపీ పుట్టిన రోజును పురస్కరించుకుని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌, అగతముడి అరుణ్‌కుమార్‌, పెద్దిన అమర్‌నాథ్‌, మాతల గాంధీ, యువజన నాయకులు చింతాడ కోటేశ్వరరావులు కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. టెక్కలి : స్థానిక టిడిపి కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి హనుమంతు రామకృష్ణ, చాపర గణపతి, పోలాకి షణ్ముఖనరావు, మహిళా అధ్యక్షులు మెండ దమయంతి, మామిడి రాము, మట్ట పురుషోత్తం, సుందరమ్మ, కోళ్ల లవకుమార్‌, కామేష్‌, దల్లి ప్రసాద్‌రెడ్డి, రెయ్యి ప్రీతీష్‌చంద్‌, జీరు వెంకటరెడ్డి, గండి చంద్రరావు, మల్లిపెద్ది మధు, ఇప్పిలి జగదీష్‌, ఎస్‌.కిరణ్‌కుమార్‌లు ఎంపీ జన్మదినం సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. కోటబొమ్మాళి: స్థానిక టిడిపి కార్యాలయంలో ఎంపీ జన్మదిన సందర్భంగా టిడిపి మండల పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్‌, మాజీ ఎంపి తర్ర రామకృష్ణ, ఎంపిటిసి పట్ట సింహాచలం, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు.

 

➡️