ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

పట్టణంలోని గొల్లవీధిలోని బాప్టిస్టి చర్చిలో అధ్యక్షుడు ప్రత్తి విజయా కుమార్‌, కార్యదర్శి ఎం.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి ఆధ్వర్యాన నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, జెసిఎస్‌

ఇచ్ఛాపురం : వేడుకల్లో పాల్గొన్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

ఇచ్ఛాపురం : పట్టణంలోని గొల్లవీధిలోని బాప్టిస్టి చర్చిలో అధ్యక్షుడు ప్రత్తి విజయా కుమార్‌, కార్యదర్శి ఎం.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి ఆధ్వర్యాన నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, జెసిఎస్‌ అధ్యక్షులు సాలిన ఢిల్లీరావు, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు ప్రత్తి అన్వేష్‌, వార్డు కౌన్సిలర్‌ ప్రదీప్‌కుమార్‌, పత్తి విజయకుమార్‌, టిడిపి నాయకులు ఆశి లీలారాణి, కాళ్ల దిలీప్‌కుమార్‌, కాళ్ల జయదేవ్‌, నందిగాం కోటేశ్వరరావు పాల్గొన్నారు. పోలాకి : మండలంలోని ఉరజాంలోని లివింగ్‌ గాడ్‌ మినిస్టర్‌ చర్చిలో ఫాస్టర్టు ఆర్‌.అప్పలనాయుడు, ఆర్‌.వినోద్‌కుమార్‌, పోలాకిలో డోల రోడ్‌లోని ఇమాన్యుయల్‌ చర్చిలో ఫాస్టర్‌ తూలుగు సత్యతేజ ఆధ్వర్యాన క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డి.ప్రసాదరాజు పాల్గొన్నారు. కవిటి: క్రీస్తు బోధనలు అనుసరణీయమని సర్పంచ్‌ పూడి లక్ష్మణరావు అన్నారు. కవిటిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో బెందాళం శివ ప్రసాద్‌, మురళీకృష్ణ, నారాయణ, నూకరాజు పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌: టెక్కలిలోని లివింగ్‌ స్టన్‌ చర్చిలో పాస్టర్‌ కణితి అబ్రహం ఆధ్వర్యాన నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలలో నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరొవు పాల్గొని క్రిస్టియన్‌ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ కిల్లి రామ్మోహనరావు, మధు, ఆట్ల రాహుల్‌కుమార్‌ పాల్గొన్నారు. కొత్తూరు : మండలంలోని పారాపురంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో తూర్పుకాపు చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌ పాల్గొని కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. రెండు వేల మందికి దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్‌ తోట నందకుమార్‌, వైసిపి నాయకులు గోగుల వరప్రసాదరావునాయుడు, టి.కిరణ్‌కుమార్‌, కె.వలిసినాయుడు, పిన్నింటి రామారావునాయుడు, జడ్డు రామకృష్ణ, వై.గోవిందరావు, సాయి పాల్గొన్నారు.టెక్కలి : స్థానిక లివింగ్‌ స్టోన్‌ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, మండలంలోని నర్సింగపల్లి, అయోధ్యాపురం, బొప్పాయిపురం, పాతనౌపడ, పెద్దరోకళ్లపల్లి, అక్కవరం పంచాయతీల్లో సర్పంచ్‌లు రౌతు జయమోహన్‌, బగాది హరి, గుజ్జు మోహన్‌రెడ్డి, దల్లి లోకేశ్వరరెడ్డి, రాంపాత్రుని మురళి, పొట్నూరు భూలక్ష్మి, కిసాన్‌ సంఘం జిల్లా అధ్యక్షులు కోత మధుసూదనరావు, ఫారెస్టర్‌ రెవరెండ్‌ కణితి అబ్రహం పాల్గొన్నారు.కొత్తూరు : మండలంలోని గొట్టిపల్లి పంచాయతీ ఉల్లిగూడ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. అనంతరం గిరిజనులకు దుస్తులను పంపిణీ చేశారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. చిన్నారుల నృత్యాలను తిలకించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ సారిపల్లి ప్రసాదరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, సర్పంర్‌ పి.మధుబాబు, వైసిపి నాయకులు ఎం.చక్రపాణి, జి.ఆనందరావు, పంకాజ్‌దాస్‌ పాల్గొన్నారు. సోంపేట : బారువలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌, సర్పంచ్‌ ఎర్ర రజిని, వైస్‌ ఎంపిపి జి.శ్రీను, కె.సత్యం, ఎ.లోకనాథం పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్‌: న్యూ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ వాలంటీ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యాన క్రిస్మస్‌ పర్వదినాన్ని పురష్కరించుకుని అనాధ బాలికలకు బట్టలు, దుప్పట్లు, పండ్లు, క్రిస్మస్‌ కేకులు పంపిణీ చేశారు. ఆర్గనైజేషన్‌ కార్యదర్శి సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ శ్రీనివాస పట్నాయక్‌ అందజేేశారు. కార్యక్రమంలో జివిఎంసి ప్రతినిధి మంత్రి రాధా రమాదేవి, డాక్టర్‌ వినీల బారు పట్నాయక్‌, తేజ, అశ్విని, ఏంజెల్‌, దివ్య, శరణ్‌ నాయుడు పాల్గొన్నారు.ఆమదాలవలస: ఏసుక్రీస్తుతోనే ప్రజలకు దైవిక ప్రేమరక్షణ కలుగుతుందని పాస్టర్‌ జి.కృపావరం అన్నారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పట్టణంలో కృష్ణాపురంలో గ్రేస్‌ గాస్పల్‌ చర్చ్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా బ్రదర్‌ జి.ఇమ్మాన్యూల్‌ పలువురితో కలిసి గీతాలాపనలు చేశారు. అనంతరం పాస్టర్‌ కృపావరం దంపతులు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డాక్టర్‌ పి.తాతయ్యలు, రామకృష్ణ పాల్గొని క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. పొందూరు: స్థానిక పార్వతీనగర్‌ కాలనీలో సిఎంసి చర్చిలో చర్చి కాపరి సిహెచ్‌ ప్రభుదాస్‌, మిరాకిల్‌ యూత్‌ మినిస్ట్రీస్‌ చైర్మెన్‌ జీవన్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు గాయకులు స్తుతి గీతాలను ఆలపించారు. అలాగే రాపాక కూడలి, కొంచాడ, జోగన్నపేట, లుట్టపేట, లోలుగు తదితర గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలను జరిపి కేకును కట్‌ చేసి మిఠాయిలను పంచిపెట్టారు.

 

➡️