ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

నూతన సంవత్సరం సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు ఆయన నివాసంలో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ శుభం కలగాలని మంత్రి

బొత్సకు శుభాకాంక్షలు తెలుపుతున్న ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌, అధికారులు

ప్రజాశక్తి- ఎచ్చెర్ల

నూతన సంవత్సరం సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ట్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు ఆయన నివాసంలో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది అందరికీ శుభం కలగాలని మంత్రి బొత్స ఆకాంక్షించారు. సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఒఎస్‌డి సుధాకర్‌ బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్‌ మోహన్‌ కృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ ఆసిరి నాయుడు, డీన్‌ వెల్ఫేర్‌ రవి, పిఆర్‌ఒ మామిడి షణ్ముఖ ఉన్నారు.కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ను డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య నిమ్మ వెంకటరావు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.పోలాకి : మండలంలోని మబగాంలో వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ స్వగృహంలో నలుమూలల నుంచి వైసిపి నాయకులు, కార్యకర్తలు, అదికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్వగృహంలో టిడిపి నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వెదుళ్లవలసలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు స్వగృహంలో, చీడివలసలో ఎంపిపి ముద్దాడ దమయంతి, భైరాగినాయుడు స్వగృహంలో, సుసరాంలో మాజీ ఎంపిపి తమ్మినేని భూషణరావు స్వగృహంలో నాయకులు, అధికారులు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.కవిటి: ఎమ్మెల్యే అశోక్‌, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపిపి కడియాల పద్మ ప్రకాష్‌లకు నాయకులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.మెళియాపుట్టి : పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, తూర్పు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌కు, సిరిపురపు తేజేశ్వరరావు, టిడిపి నాయకులు మామిడి గోవిందరావులకు, మెళియాపుట్టిలో ఎంపిపి రానా ఈశ్వరమ్మ, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, మాజీ ఎంపపి సలాన మోహనరావులకు నాయకులు, అధికారులు, తహశీల్దార్‌ సరోజని, ఎంపిడిఒలకు అధికారులు పుష్పగుచ్ఛాల ను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వజ్రపుకొత్తూరు: జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పాలిన శ్రావణి, వైసిపి జిల్లాఉపాధ్యక్షులు పాలిన శ్రీనివాసరావులకు నాయకులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి మండల యువజన విభాగం అధ్యక్షుడు మద్దిల హరినారాయణ, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాలిన ఉమామహేశ్వరరావు, సర్పంచ్‌లు దున్న రత్నం బాలరాజు, మామిడి భాస్కరరావు, కొల్లి భాస్కరరావు, బచ్చాల ధర్మారావు, ఎంపిటిసి మాకయ్య కారి వెంకటరావు పాల్గొన్నారు. టెక్కలి : కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ పేడాడ పరమేశ్వరరావు కార్యాలయానికి నాయకులు వచ్చి పుష్పగుచ్ఛాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కోత మధుసూదనరావు, పొట్నూరు ఆనందరావు, శాసుమహంతి ధర్మారావు పాల్గొన్నారు. పలాస టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి గౌతు శివాజీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషకు నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, పి.విఠల్‌రావు, వజ్జ గంగాభవాని, మాజీ ఎంపిపి దువ్వాడ కృష్ణమూర్తినాయుడు, టంకాల రవిశంకర్‌ గుప్త, బూరెల విజరు, బి.నాగరాజు, మల్లా శ్రీనివాసరావు, టిడిపి మండల అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్ఞ బాబూరావు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్‌, కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌, సర్పంచ్‌లు, ఎంపిటిసిల ఇళ్ల వద్ద నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు.టెక్కలి రూరల్‌ : మండలంలోని అక్కవరంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణిలకు నాయకులు, అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా కృపారాణి దంపతులకు పూలమాలలు వేసి సన్మానించారు. కొత్తూరు : మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు టిడిపి నాయకులు పుష్పచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వైసిపి జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసీవరప్రసాదరావుకు వైసిపి నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ వైస్‌ ఎంపిపి అగతముడి భైరాగినాయుడు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.పొందూరు: మండల యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్‌సిలో సోమవారం న్యూఇయర్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒలు పైడి వెంకటరామరాజు, పి.రాజారావు కేకు కట్‌ చేసి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా పూర్వ అధ్యక్షులు పొందూరు అప్పారావు, మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురుగుబెల్లి గోపాలరావు, కెవిఎం సత్యనారాయణ, ట్రెజరర్‌ గుంటుకు వాసుదేవరావు, పి.కృష్ణారావు, బొడ్డేపల్లి అర్జునరావు, శ్యామలరావు పాల్గొన్నారు.ఆమదాలవలస : నూతన సంవత్సర శుభాకాంక్షలు తమ నాయకుడు కూన రవికుమార్‌కు చెప్పేందుకు నియోజకవర్గ పరిధిలో బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాలతో పాటు మున్సిపాలిటీ ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అలాగే వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రతినిధి సువ్వారి సత్యనారాయణ(ఢిల్లీ)కి పలు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకొని పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైసిపి సీనియర్‌ నాయకుడు కోట గోవిందరావుకు పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీకాకుళం అర్బన్‌: అరసవల్లిలో మాజీమంత్రి గుండ అప్పలసూర్య నారాయణ, మాజీ శాసన సభ్యులు లక్ష్మీదేవిలు ఆనందోత్సవాల నడుమ కేకు కట్‌ చేసి సంబరాలు జరిపారు. ఈ వేడుకల్లో టిడిపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారికి నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో గార, శ్రీకాకుళం మండలాలతో పాటు నగరానికి చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు.

 

➡️