ఘనంగా సిఎం జన్మదిన వేడుకలు

రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసిపికే పట్టం కట్టడం ఖాయమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం జోష్యం చెప్పారు. పట్టణంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి 51వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం పట్టణ శివారులో ఉన్న

ఆమదాలవలస : దుస్తులను పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసిపికే పట్టం కట్టడం ఖాయమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం జోష్యం చెప్పారు. పట్టణంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి 51వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం పట్టణ శివారులో ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర ఉన్నంత వరకు సిఎం జగన్మోహన్‌ రెడ్డి అద్భుతమైన పరిపాలన లిఖితమై ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల, మున్సిపాలిటీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పట్టణంలో ఫ్లైఓవర్‌ దిగువున ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సువ్వారి సువర్ణ పూలమాలవేసి నివాళ్లర్పించారు. పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సువ్వారి దివ్య, నాయకులు సువ్వారి సత్యనారాయణ, పేడాడ వైకుంఠరావు, సువ్వారి అనిల్‌, కోరుకొండ సాయికుమార్‌, పెయ్యల ప్రసాద్‌ పాల్గొన్నారు. అలాగే వైసిపి సీనియర్‌ నాయకులు కోట గోవిందరావు ఆధ్వర్యాన జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు.పలాస : మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్‌ జన్మదిన వేడుకులు సందర్భంగా పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి, ఎఎంసి చైర్మన్‌ పి.వి.సతీష్‌ ఆపల్గొన్నారు. కాశీబుగ్గ సూదికొండ సచివాలయం, ప్రభుత్వ పాఠశాల వద్ద వార్డు కౌన్సిలర్‌ శిష్టు గోపి బృందావతి, వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బడగల బల్లయ్యలు కేక్‌ కట్‌ చేశారు. బ్రాహ్మణతర్లలో పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి, సర్పంచ్‌ బి.పుష్పాలత, ఎంపిటిసి మాజీ సభ్యులు దంతం వైకుంఠరావులు కేక్‌ కట్‌ చేశారు. శ్రీకాకుళం అర్బన్‌: సంక్షేమ పథకాల సారథిగా, సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారని వైసిపి జిల్లా అధ్యక్షుడు నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కష్ణదాన్‌ అన్నారు. నగరంలోని వైసిపి కార్యాలయంలో జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలో పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళింగవైశ్య కార్పొరేషన్‌ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి.పద్మావతి, వైసిపి యువనేత ధర్మాన రామ్‌ మనోహర్‌ నాయుడు, వైసిపి నాయకులు ఎన్ని ధనుంజయరావు, ఎస్‌డి మురళి, కొంక్యాన మురళీధర్‌, కోనాడ నర్సింగరావు, డాక్టర్‌ శ్రీనివాస్‌ పట్నాయక్‌, అంధవరపు సంతోష్‌, అంధవరపు ప్రసాద్‌, పొన్నాడ రుషి, పైడి రాజారావు, గాయత్రి, డిపి దేవ్‌, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదరరావు పాల్గొన్నారు.రణస్థలం: రామతీర్థం జంక్షన్‌ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జగన్మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ కేక్‌కట్‌ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 120 మంది రక్తదానం చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండల ఎంపిపి ప్రతినిధి పిన్నింటి సాయికుమార్‌, ఎచ్చెర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్‌, జడ్‌పిటిసి టొంపల సీతారాం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.లావేరు: మండలంలోని వెంకటాపురం గ్రామంలో సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు వైసిపి సీనియర్‌ నాయకులు లుకలాపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, జి.సిగడం మండలాల నాయకులు జరుగుళ్ల శంకరరావు, పైడి శ్రీనువాసరావు, బూరాడ వెంకటరమణ, వి.సత్యం పాల్గొన్నారు. కొత్తూరు : సిఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా నివగాం రోడ్డులోని వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం 200 మంది పేదలకు దుప్పట్లు, సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆస్పత్రిలో అర్హులకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల ను అందజేశారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు సారిపల్లి ప్రసాదరావు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సారిపల్లి నిరోష, జెడ్‌పిటిసి భాగ్యవతి, పిఎసిఎస్‌ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, సర్పంచ్‌లు పి.కృష్ణవేణి, సాధుబాబు, అశోక్‌ పాల్గొన్నారు. సోంపేట: సిఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ పళ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సోంపేటలోని నూతనంగా నిర్మించిన జడ్పిటిసి కార్యాలయాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో ఎంపిపి డాక్టర్‌ నిమ్మన దాసు, జెడ్‌పిటిసి తడక యశోద, కంచిలి జెడ్‌పిటిసి ఇప్పిలి లోలాక్షి, ఎఎంసి చైర్మన్‌ బతకల మోహనరావు, సోంపేట సర్పంచ్‌ నగిరి ప్రభావతి, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు శిలగాన భాస్కరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు రౌతు విశ్వనాథం పాల్గొన్నారు. బారువాలో సర్పంచ్‌ ఎర్రా రజిని, ప్రతినిధి తారకేశ్వరరావు, మకన్నపురం, కొర్లాం గ్రామాల్లో కేక్‌ను కట్‌ చేశారు.మెళియాపుట్టి : మండలంలో సవరముకుందపురంలో సిఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం స్థానిక గిరిజనులతో సహా పంక్తి భోజనం చేశారు. మెలియాపుట్టి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి బి.ఉదరుకుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఊర్లాన బాలరాజు, మండల పార్టీ అధ్యక్షులు పల్లి యోగి, సర్పంచ్‌ సవర భాస్కరరావు పాల్గొన్నారు. అలాగే కొసమాలలో సిఎం పుట్టిన రోజు సందర్భంగా తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాకాంత్‌ కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం వంద మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపిపి ఎస్‌.ఆదినాయుడు, వైస్‌ ఎంపిపి ప్రతినిధి పాడి అప్పారావు, ఎఎంసి మాజీ వైస్‌ చైర్మన్‌ అనపాన రాజశేఖరరెడ్డి, సర్పంచ్‌లు పెద్దింటి చందర్రావు, గణేష్‌ ప్రధాన్‌, బోసి రామారావు, సిద్దిపాలెం గౌరీస్‌, సవర రంగారావు, బొంతు అప్పారావు, రెకనా వాసు, కన్నబాబు, ఎంపిటిసి సవర రవికుమార్‌, ఎన్ని సోమేశ్‌, రవీంద్ర జన్నాథం, శ్రీను, వెంకటరావు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం : సిఎం పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌లు కేక్‌ చేసి అందరికీ పెంచిపెట్టారు. అనంతరం వృద్ధులకు చీరలు, పళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ముందుగా మండలంలోని లొద్దపుట్టి ప్రజాప్రస్థాన విజయ స్థూపం వద్ద వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్‌ కుమార్‌ అగర్వాల్‌, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దుక్క లోకేశ్వరరెడ్డి, ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పడ నారాయణమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు నర్తు నరేంద్రయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.రాజ్యలక్ష్మి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్లు ఉలాల భారతీదివ్య, లాభాల స్వర్ణమణి, పట్టణ అధ్యక్షుడు ప్రకాశరావు పట్నాయక్‌, మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, జెసిఎస్‌ సాలిన ఢిల్లీ, చాట్ల తులసీదాస్‌రెడ్డి, దువ్వు వివేకానంద, దున్న గురుమూర్తి, కరంగి మోహనరావు, ఉప్పాడ రాజారెడ్డి, నర్తు ప్రసాద్‌ పాల్గొన్నారు.టెక్కలి రూరల్‌ : స్థానిక వైసిపి కార్యాలయంలో సిఎం జగన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కేక్‌ను కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ మేరకు వైసిపి కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ కూడలి వరకు ర్యాల నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిపి అట్లా సరోజనమ్మ ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. టెక్కలి : మండలంలోని బొప్పాయిపురం పరశురాంపురం, అయోధ్యపురం, నర్సింగపల్లి, పాతనౌపడ, పెద్దరోకలపల్లి పంచాయతీల్లో సర్పంచ్‌లు సిఎం జగన్‌ జన్మదినం సందర్భంగా కేక్‌లను కట్‌ చేశారు. ఈ సందర్భంగా నవరత్నాల పథకాల కార్డ్స్‌తో ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు గుజ్జు మోహన్‌రెడ్డి, కామేశ్వరరావు, బగాది హరి, జయ మోహన్‌, దల్లి లోకేశ్వర్‌రెడ్డి, రాంపాత్రుని మురళి పాల్గొన్నారు.పోలాకి : పోలాకిలో జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య సిఎం జన్మదినం సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయిడు, కణితి కృష్ణారావు, సర్పంచ్‌ ప్రతినిధి మజ్జి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కవిటి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సిఎం జగన్‌ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్సీ నర్తు రామారావు కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్‌, నరేష్‌కుమార్‌ అగర్వాలా, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌, సర్పంచ్‌ సంఘం మండల అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు, నాయకులు ఎన్‌.నరేంద్ర, దేవరాజ్‌ సాహు, పూడి నీలాచలం, బర్ల నాగభూషణం, బెందాళం రమణమూర్తి, ఎలమంచి నీలయ్య, దువ్వు కృష్ణారెడ్డి, పాండవ శేఖర్‌ పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు : మండలంలోని బెండి సచివాలయంలో సిఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు హనుమంతు వెంకటరావుదొర కేక్‌ కట్‌ చేశారు. సర్పంచ్‌ గూడ గిరిజ, ప్రతినిధి ఈశ్వరరావు పాల్గొన్నారు. నౌపడ : సంతబొమ్మాళి మండలం హనుమంతు నాయుడుపేట వైసిపి కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జెడ్‌పిటిసి పాలవసంతరెడ్డి సిఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వృద్ధులకు, మహిళలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కోటబొమ్మాళి: స్థానిక వైసిపి కార్యాలయంలో సిఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కేక్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు నూక సత్యరాజు, వైఎస్‌ ఎంపిపి దుక్క రోజా, కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు పాల్గొన్నారు.నందిగాం : స్థానిక వైసిపి కార్యాలయంలో సిఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.తిలక్‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కేక్‌ కట్‌ చేశారు. మండలంలోని మదనాపురం కస్తూరిబా బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు రగ్గులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్‌ బాలకృష్ణారావు కోటబొమ్మాళి ఎంపిపి ఉమామల్లేశ్వరరావు, జెడ్‌పిటిసిలు వెంకటరావు, పి.వసంతరెడ్డి పాల్గొన్నారు.సంతబొమ్మాళి : మండలంలోని ఉమిలాడలో సర్పంచ్‌ కెల్లి లక్ష్మి, జగన్నాథపురంలో సర్పంచ్‌ జోగి రాములమ్మ, పాలతలగాంలో సర్పంచ్‌ నక్కిట్ల అప్పన్న, నరసాపురంలో సర్పంచ్‌ దుక్క భూషణరెడ్డి, గోవిందపురంలో సర్పంచ్‌ రెయ్య రామిరెడ్డి, కాపుగోదయ్యవలసలో సర్పంచ్‌ అంగ లక్ష్మిలు సిఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌లు కట్‌ చేశారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు, ఉప్పాడ లోకనాథం, అట్టాడ అప్పలనాయుడు, జొన్న సవరరాజు పాల్గొన్నారు.

 

➡️