చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పలాస : పోస్టర్‌ను అందజేస్తున్న గౌతు శిరీష

ప్రజాశక్తి- పలాస

వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో చినబడాంలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముందుగా వార్డులో పర్యటించి వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ఆక్రమణలు, అరాచకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టిడిపి మేనిఫోస్టోతో కూడిన పోస్టర్లను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా, కొండలు, గుట్టలు వాగులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రైల్వే వంతెనకు రెండోసారి శంకుస్థాపన చేసి ఇప్పటికీ రైల్వే వంతెన పూర్తి చేయలేకపోయారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బి.నాగరాజు, గాలి కృష్ణారావు, అంబటి కృష్ణమూర్తి, సప్ప నవీన్‌ పాల్గొన్నారు. కోటబొమ్మాళి: రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనతో విసుగుచెంది మార్పు కోరుకుంటున్నారని టిడిపి సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపిటిసి సభ్యులు హనుమంతు అప్పలరాజు అన్నారు. మండలంలోని హరిశ్చంద్రపురంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో లింగుబారి రామప్పడు, డోకి నానాజీ, గంగిట్ల అప్పన్న, ఉప్పాడ సింహాచలం పాల్గొన్నారు.

 

➡️