చర్చల పేరుతో కాలయాపన తగదు

న్యాయసమ్మతంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో

శ్రీకాకుళం : మానవహారం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

న్యాయసమ్మతంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్‌, జిల్లాప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం ఆరోపించారు. బుధవారం నగరంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరం వద్ద సంఘం ఆధ్వర్యాన మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడులూ సమ్మె 9వ రోజుకు చేరినా సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. సిఎం జగన్మోహనరెడ్డి పాదయాత్ర సమయంలో, అసెంబ్లీలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఆప్కస్‌ పరిధిలో ఉన్న కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని కోరారు. 60ఏళ్లు నిండిన కార్మికులను విధులు నుంచి తొలగించిన తర్వాత పెన్షన్‌, గ్రాడ్యుటీ చెల్లించాలన్నారు. కార్మికులు ఏకారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.మోహన,్‌ వి.రాంబాబు, బి.గణేష్‌, సూపర్‌వైజర్లు, డైవర్లు సురేష్‌ కుమార్‌, అప్పన్న, ఎస్‌.శివరాం, పి.హరి, రాజు, చిట్టి, ఎ.రాము తదితరులు పాల్గొన్నారు.ఆమదాలవలస: పట్టణంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారానికి 9వ రోజుకు చేరుకోవడంతో ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు నిరసనగా పారిశుద్ధ్య కార్మిక నాయకుడు తాడి సంతోష్‌ ఆధ్వర్యంలో అర్ధనగ ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మిక నాయకులు కె.తారకేశ్వరరావు, జె.శ్రీను, కె.ఈశ్వరరావు, కె.వెంకటరావు, జె.వాసు, ఎన్‌. రాజేష్‌ పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం అర్ధనగ ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్‌కుమార్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు. పలాస : సిఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, యూనియన్‌ నాయకులు అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.మురగన్‌, ఎం.రవి, దివాకర్‌, ఎస్‌.శంకర్‌, తిరుపతి, ప్రకాష్‌ముఖి, సీతమ్మ, గులాబి, లక్ష్మి పాల్గొన్నారు.

 

➡️