చలివేంద్రాలు ప్రారంభం

వేసవి తీవ్రత దృష్ట్యా మండలంలోని ప్రతి పంచాయతీలోనూ

సోంపేట : చలివేంద్రం ప్రారంభిస్తున్న అధికారులు

కవిటి:

వేసవి తీవ్రత దృష్ట్యా మండలంలోని ప్రతి పంచాయతీలోనూ సోమవారం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కవిటి బస్టాండ్‌లోని ప్రయాణికుల విశ్రాంత భవనంలో తహశీల్దార్‌ లక్ష్మి, ఎంపిడిఒ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లిని తాగునీరు అందించారు. అనంతరం మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రతి సచివాలయం పరిధిలోనూ చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాటసారులు, ప్రయాణికులు వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎంసిసి సత్యనారాయణ, ఇఒ వీరబద్రస్వామి, విఆర్‌ఒలు నారాయణ, ప్రశాంతి పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ మామిడి సురేష్‌ చలివేంద్రం ప్రారంభించారు. ఎండలు కారణంగా కార్యాలయానికి పనులపై వచ్చిన సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు తెలిపారు. కార్యక్రమంలో డిటి వాయలపల్లి గిరిరాజ్‌, ఆర్‌ఐ పవిత్ర, విఆర్‌ఒలు పాల్గొన్నారు. సోంపేట : ఎంపిడిఒ కె.రామారావు ఆదేశాల మేరకు కొర్లం పంచాయతీ అధికారులు స్థానిక కూడలి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు.

 

➡️