చలో టెక్కలిని జయప్రదం చేయాలి

మండలంలో షిరిడీ సాయిబాబా మందిరం ఆవరణలో మండల ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు

నినాదాలు చేస్తున్న ఆదివాసీ నాయకులు

ప్రజాశక్తి- మెళియాపుట్టి

మండలంలో షిరిడీ సాయిబాబా మందిరం ఆవరణలో మండల ఆదివాసీ నాయకులు, ఉద్యోగులు శుక్రవారం సమావేశమయ్యారు. జిల్లాలో గత 15 రోజులుగా కవిటి మండలంలో ఒడ్డి ఒరియా కులానికి చెందిన వారు దీక్ష చేస్తున్నారని, వీరికి మద్దతుగా అధికార పార్టీ ఉండడం బాధాకరమన్నారు. జిల్లాలో బెంతుఒరియా తెగ లేదన్నారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని బెంతుఒరియాలుగా చెలామణి అయి ఆదివాసీ రిజర్వేషన్‌ దోచుకోడానికి చుస్తూన్నారన్నారు. ఆదివాసీ తెగల్లో వేరే అగ్రకులాలు చేర్చరాదని 29న చలో టెక్కలి శాంతియుత ర్యాలీ కార్యక్రమం చేపట్టనున్నామని, ఆదివాసీలు పెద్దఎత్తున పాల్గుని ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసి సేన రాష్ట్ర కార్యదర్శి వరహాల కృష్ణారావు, మండల నాయకులు సవర రామారావు, జన్ని ధర్మారావు, అజారి రామారావు, యవ్వారం సుజాత, పలువురు నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

 

➡️