చిత్తడిగా ఎబి రోడ్డు

మిచౌంగ్‌ తుపానుతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి అలికాం-బత్తిలి ప్రధాన రహదారి చిత్తడిగా మారి వాహనదారులను ఇబ్బందులకు గురి

అధ్వానంగా తయారైన అలికాం-బత్తిలి ప్రధాన రహదారి

ప్రజాశక్తి- సరుబుజ్జిలి

మిచౌంగ్‌ తుపానుతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి అలికాం-బత్తిలి ప్రధాన రహదారి చిత్తడిగా మారి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. భారీ గుంతలతో ఉన్న రహదారి వర్షపునీటితో గుంతలన్నీ నిండి చెరువులను తలపించాయి. ప్రధాన రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ద్విచక్ర వాహనదారులు గుంతలను గుర్తించలేక పలువురు గుంతల్లో పడిలేవడం పట్ల ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం వద్ద గుంతల్లో నీరుచేరి ప్రధాన రహదారి చెరువును తలపించింది. నిత్యం వందలాదిమంది నాయకులు, అధికారులు ఇదే రహదారిపై ప్రయాణం చేస్తున్నప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోవడంలేదని పలువురు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహనదారుల ఇబ్బందులను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

 

➡️