జాగ్రత్తగా చేర్పులు, తొలగింపులు

ఎలక్ట్రోరల్‌ చేర్పులు, మార్పులు జాగ్రత్తగా పరిశీలించాలని రాష్ట్ర

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు

శ్రీకాకుళం : ఎలక్ట్రోరల్‌ చేర్పులు, మార్పులు జాగ్రత్తగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అధికారులను ఆదేశించారు. డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఎస్‌ఎస్‌ఆర్‌-24 సమయంలో స్వీకరించిన ఫారాలు, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల భద్రత తదితర అంశాలపై విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనల్‌ పబ్లికేషన్‌ అయిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేయకుండా అప్రూవల్‌ చేయకూడదని స్పష్టం చేశారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ జిల్లాలో ఎలక్ట్రోరల్‌ రోల్స్‌ ఫైనల్‌ పబ్లికేషన్‌ అయిన తర్వాత వచ్చిన దరఖాస్తుల గురించి వివరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, ఎన్నికల విధులు నిర్వహణ సిబ్బంది, జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు తదితర అంశాలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్‌డిఒలు ఎస్‌.భరత్‌ నాయక్‌, సిహెచ్‌.రంగయ్య, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ తదితరులు పాల్గొన్నారు.సిక్కోలు డ్వాక్రా బజారుకు రూ.50 వేలు సాయం శ్రీకాకుళం అర్బన్‌ : నగరంలోని మున్సిపల్‌ మైదానంలో గత నెల 3నుంచి 9వరకు ఆరు రోజులపాటు సిక్కోలు డ్వాక్రా బజారు నిర్వహించారు. ఈ బజారు నిర్వహణకు డిఆర్‌డిఎ అధికారులు వివిధ బ్యాంకుల సహకారాన్ని కోరారు. ఇందుకుగాను యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, రీజనల్‌ కార్యాలయం అధికారులు రూ.50 వేలు చెక్కును శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో లీడ్‌బ్యాంకు మేనేజరు సూర్యకిరణ్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రీజినల్‌ హెడ్‌ ఎం.వి.తిలక్‌, చీఫ్‌ మేనేజర్‌ దుర్గాప్రసాద్‌, సర్వీసెస్‌ మేనేజరు మురళీకృష్ణలు పాల్గొన్నారు.

 

 

➡️