జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీలకు జిల్లావాసులు

ప్రతిష్టాత్మక సీనియర్‌ నేషనల్స్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఆలిండియా సీనియర్స్‌ పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్‌

క్రీడాకారులను అభినందిస్తున్న ఎమ్మెస్సార్‌, అర్జున్‌ రెడ్డి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ప్రతిష్టాత్మక సీనియర్‌ నేషనల్స్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ఆలిండియా సీనియర్స్‌ పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు డిసెంబరు 3 నుంచి 10 వరకు పంజాబ్‌లోని లుధియానాలవ వేదికగా జరుగనున్నాయి. ఈ పోటీలకు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌ పురుషుల జట్టుకు కె.జయకృష్ణ, మహిళల జట్టుకు ఎం.డి. హఫీజ ఎంపికయ్యారు. ఈ పోటీలకు ముందు చిత్తూరు వేదికగా జరిగిన శిక్షణా శిబిరాల్లో క్రమశిక్షణగా అత్యద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకోవడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, డిఎస్‌ఎ కోచ్‌ గాలి అర్జున్‌రావురెడ్డి తెలిపారు. జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులకు జాతీయ పోటీలకు అవకాశం లభించడంపై జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ఎమ్మెస్సార్‌ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ పోటీల్లో ఆంధ్రా జట్లను విజయపథంలో నిలపాలని ఆకాంక్షించారు. ఇద్దరూ ఉద్యోగులే. కాగా, జాతీయ పోటీలకు ఎంపికైనవారి ఇద్దరు క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ఇందులో కె.జయకృష్ణ ఎల్‌ఎన్‌పేట మండలం రావిచంద్రి సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. ఎం.డి.హఫీజ శ్రీకాకుళం దిశా పోలీస్‌స్టేషన్‌ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది. గతంలోను అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తు గుర్తింపు పొందారు. వీరి ఎంపికపై ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, డిఎస్‌డిఒ డాక్టర్‌ శ్రీధరరావు, బాస్కెట్‌బాల్‌ సంఘ ప్రతినిధులు, పిఇటి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

 

➡️