జీడికి మద్దతు ధర కల్పించాలి

జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి దళారీల దోపిడీని అరికట్టాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ అన్నారు. కాశీబుగ్గ సిఐటియు
  • రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహనరావు

ప్రజాశక్తి- పలాస : జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి దళారీల దోపిడీని అరికట్టాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ అన్నారు. కాశీబుగ్గ సిఐటియు కార్యాలయంలో బుధవారం రైతు సంఘం ఆధ్వర్యాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి రైతుల సమస్యలను గురువారం పలాస వస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తుమని అన్నారు. రైతుల నుంచి సేకరించిన లక్ష సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. జీడి పిక్కలు 80 కేజీల బస్తాకి రూ.16 వేలు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పశు సంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు జీడి రైతులను నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారన్నారు. గతంలో రూ.14 వేలు ధర పలికితే… ప్రస్తుతం రూ.7 వేలు విక్రయించి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జీడి రైతులను ఆదుకుంటామని సిఎం బహిరంగ సభలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. విదేశాల జీడి పిక్కల దిగుమతులపై ఆంక్షలు విధించాలన్నారు. కేరళ తరహాలో జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి జీడి పంట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తిత్లీ తుపానులో నష్టపోయిన జీడి, కొబ్బరి రైతులకు ఇప్పటికీ రెట్టింపు పరిహారం అందలేదని అన్నారు. జీడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సత్తుపల్లి కృష్ణారావు, కోనేరు గురయ్య, అంబటి రామకృష్ణ, యంపళ్ల జోగారావు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలుప్రజాశక్తి- శ్రీకాకుళంజిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎపి తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్‌ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భాన్ని పురస్కరించుకొని విద్యుత్‌ పొదుపు అవగాహనా ర్యాలీలు జిల్లా ప్రధాన కేంద్రం, డివిజన్‌ కేంద్రాల్లో ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. స్వయం సహాయక మహిళా బృందాలకు ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్‌ రేటెడ్‌ గృహోపకరణాలు ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. ‘విద్యుత్‌ పొదుపు ఆవశ్యకత, నూతన సాంకేతిక విజ్ఞానం’ అనే అంశంపై నిష్ణాతులచే ఇంజినీరింగ్‌ కాలేజీల్లో వర్క్‌షాపులు నిర్వహిస్తామన్నారు. విద్యుత్‌ పొదుపు ఆవశ్యకత గురించి వినియోగదారులతో అన్ని విద్యుత్‌ కార్యాలయాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. 20న విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు.

 

➡️