జీడి గిట్టుబాటు ధరకు కృషి చేయాలి

ఉద్దాన ప్రాంత రైతులు జీడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, జీడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలని రైతాంగ సమస్యల

శిరీషకు వినతిపత్రం అందజేస్తున్న రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి- పలాస

ఉద్దాన ప్రాంత రైతులు జీడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, జీడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలని రైతాంగ సమస్యల సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు మామిడి మాధవరావు కోరారు. మండలంలోని బొడ్డపాడులో రాజకీయ పార్టీ నాయకులను ప్రశ్నించే కార్యక్రమంలో భాగంగా అటుగా పర్యటిస్తున్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను బుధవారం కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీడిపిక్కల బస్తా (80 కేజీల)కు రూ.16 వేలు గిట్టుబాటు ధర కల్పించి ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ… ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వంశధార జలాలను ఇచ్ఛాపురం వరకు పొడిగించి ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నా రు. ఈ నెల 5న పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటనల్లో జీడి, కొబ్బరి రైతుల సమస్యలను విన్నవించుకునేందుకు అవకాశం కల్పించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో కిక్కర ఢిల్లీరావు, తామాడ తిలోచనరావు, దాసరి శ్రీరాములు, మద్దిల ధర్మారావు, వడ్డి సింహాద్రి, రాజాం గుణవంతు పాల్గొన్నారు.

 

➡️