జెడ్‌పి చైర్‌పర్సన్‌ పరామర్శ

ఎంపిపి కడియా పద్మ అనారోగ్యానికి గురై విశాఖపట్నంలో చికిత్సపొంది ఇటీవల ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ

ఎంపిపితో మాట్లాడుతున్న విజయ

ప్రజాశక్తి- కవిటి

ఎంపిపి కడియా పద్మ అనారోగ్యానికి గురై విశాఖపట్నంలో చికిత్సపొంది ఇటీవల ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ సోమవారం పరామర్శించారు. పద్మతో మాట్లాడి ఆరోగ్యంపై వాకబు చేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలి కాళీని పరామర్శించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాష్‌, కంచిలి ఎంపిపి పి.దేవదాస్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్‌ బాబూరావు, వైస్‌చైర్మన్‌ వై.నీలయ్య, సర్పంచ్‌లు బి.శ్రీరామ్‌ప్రసాద్‌, కడియాల హేమలత, ఎన్ని అశోక్‌, దీనబందు పాల్గొన్నారు.

 

➡️