టిడిపి ఇంటింటా ప్రచారం

రాష్ట్రం అభివద్ధి చెందాలంటే టిడిపి అధినేత చంద్రబాబును

పలాస : సభలో మాట్లాడుతున్న గౌతు శిరీష

ప్రజాశక్తి- పలాస

రాష్ట్రం అభివద్ధి చెందాలంటే టిడిపి అధినేత చంద్రబాబును సిఎం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. మండలంలోని శాసనాం, టెక్కలిపట్నంలో ప్రచారం చేపట్టారు. శాసనాంలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ముందుగా శాసనాం గ్రామంలో పలువురు టిడిపిలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు జగన్‌ బూటకపు హామీలను నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రవేశపెట్టి అందించనురన్నారు. అనంతరం లక్ష్మీపురంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, మాజీ ఎంపిపి దువ్వాడ కృష్ణమూర్తి నాయుడు, మాజీ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, కుత్తుం లక్ష్మణ్‌కుమార్‌, దువ్వాడ సంతోష్‌, దశరథ, చంద్రశేఖర్‌ అధికారి పాల్గొన్నారు.మెళియాపుట్టి : మండలంలోని ముక్తాపురం, చొంపాపురం గ్రామాల్లో టిడిపి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు శంఖారావం నిర్వహించారు. ఈ మేరకు సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి సలాన మోహనరావు, ఎంపిటిసి ప్రతినిధి నంబాల వెంకటరావు, ఎంపిటిసి మాజీ సభ్యులు ఎల్లంనాయుడు పాల్గొన్నారు. కవిటి: మండలంలోని సహలాలపుట్టుగ పంచాయతీలో ఎమ్మెల్యే అశోక్‌ భార్య నీలోత్సల బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు.

 

➡️