టెన్నికాయిట్‌ ఛాంపియన్‌ షిప్‌ తమిళనాడు

తక్కువ స్థలంలో శారీరకంగా, మానసికంగా దృఢత్వం అందించి అన్ని వయసుల వారు ఆడే ఆట టెన్నికాయిట్‌ అని, ఇలాంటి

విజేతలకు బహుమతులు అందజేస్తున్న మంత్రి అప్పలరాజు

ప్రజాశక్తి- పలాస

తక్కువ స్థలంలో శారీరకంగా, మానసికంగా దృఢత్వం అందించి అన్ని వయసుల వారు ఆడే ఆట టెన్నికాయిట్‌ అని, ఇలాంటి జాతీయ ఆటల పోటీలు పలాసలో నిర్వహించం ఆనందంగా ఉందని పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న 47వ జాతీయ పురుష, మహిళల టెన్నికాయిట్‌ పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ తమిళనాడు జట్టు విజయం సాదించింది. ఈ పొటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి బహుమతులు అందిచి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్వాహకులకు అభినందించారు. అనంతరం మాట్లాడుతూ పలాసలో రూ.ఐదు కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నుంచి సముఖత లభించిందన్నారు. పెంటిభద్ర చెరువు ఆధునికీకరించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. చిన్నబాణాం మైదానంలో ఓపెన్‌ ఆడి టోరియం నిర్మించడానికి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపారు. విజేతలు వీరే…టీం ఛాంపియన్‌ షిప్‌లో పురుషుల విభాగంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, పాండిచ్చేరి జట్లు నిలిచాయి. టీం ఛాంపియన్‌ షిప్‌లో మహిళల విభాగంలో తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, మహారాష్ట్ర జట్లు నిలిచాయి. సింగిల్స్‌ పురుషుల విభాగంలో ఎం.వైరముత్తు (తమిళనాడు) కిరణకుమారి (కర్నాటక) సి.రాజశేఖరన్‌ (కేరళ), పి.మురుగేషన్‌ (కర్నాటక)లు విజేతలుగా నిలిచారు. సింగిల్స్‌ మహిళల విభాగంలో ఆశ్వర్యబాబు (కేరళ), కమాలిక్‌ (పాండిచ్చేరి), ఎ.రమ్య (తమిళనాడు), ముత్తుఅజంగి (పాండిచ్చేరి)లు విజేతలుగా నిలిచారు. డబుల్స్‌ పురుషులు విభాగంలో ఎస్‌.అభిఫేక్‌. డి.విల్సన్‌ (తమిళనాడు). పి.సంతోష్‌కుమార్‌, ఎం.జి.లక్ష్మణ్‌ (కేరళ), పిజెఎండి రౌయవు. వినయ్కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌), సునీల్‌ యశ్వంత్‌ కేధార్‌, పటమహేష్‌ సంతోష్‌ (మహారాష్ట్ర)లు విజేతలుగా నిలిచారు. డబుల్స్‌ మహిళల విభాగంలో డి.దీక్షిత, ఎస్‌.పునీత్రపియ (తమిళనాడు), రెడ్డి మౌనిక, పతివాడ రేణుక (ఆంధ్రప్రదేశ్‌), భార్గవి సంజరు పవర్‌, రేణుక సమీరవయాహార్‌ (మహారాష్ట్ర)లు విజేతలుగా నిలిచారు. మిక్సిడ్‌ డబుల్స్‌ విభాగంలో బి.జయమిరిశాకన్నన్‌, ఎస్‌.మేనక (తమిళనాడు), చిత్రాడ తారకేశ్వరరావు, మల్లు ప్రవళిక (ఆంధ్రప్రదేశ్‌), రంజిత్‌, ఎం.అంచిత (కేరళ) సురజ్ధుధాకుమార్‌, జోష ఫిసజిదలి సయ్యద్‌ (మహారాష్ట్ర)లు విజేతలుగా నిలిచారు. మిక్సిడ్‌ డబుల్స్‌ విభాగంలో బి.జయమిరిశాకన్నన్‌, ఎస్‌.మేనక (తమిళనాడు), చిత్రాడ తారకేశ్వరరావు, మల్లు ప్రవళిక (ఆంధ్రప్రదేశ్‌), రంజిత్‌, ఎం.అంచిత (కేరళ), సురజ్న్‌ధాకుమార్‌, జోషఫిసజిదలిసయ్యద్‌ (మహారాష్ట్ర)లు విజేతలుగా నిలిచారు. 24 పాయింట్లతో ఓవరాల్‌ ఛాంపియన్‌ షిఫ్గా తహిళనాడు నిలవగా, 19 పాయింట్లో కేరళ, 8 పాయింట్లతో పాండిచ్చేరి నిలిచింది. ఈ పొటీల్లో సురోజిత్‌ కర్మాకర్‌, టెన్నికల్‌ కమిటీ చైర్మన్‌, డి.శంకర్‌, టెక్నికల్‌ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, టెన్నికాయిట్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు వై.డి.రామారావు, రాష్ట్ర కార్యదర్శి కె.ఎన్‌.వి.సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి పి.తవిటయ్య, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారులు పి.సుందరరావు, జిల్లా ఒలంపిక్‌ సంఘం కార్యదర్శి ఎం.సాంబమూర్తి, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.వి.రమణ, ఎఎంసి చైర్మన్‌ పి.వి.సతీష్‌, జిల్లాకు చెందిన పలువురు వ్యాయామ విద్య ఉపాద్యాయులు, వైస్‌ చైర్మన్‌ మీసాల సురె ష్బాబు, స్పోక్స్పర్సన్‌ గుజు జోగారావు పాల్గొన్నారు.

 

➡️