డిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకటరావు

ప్రజాకంటక వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు

అరాచక ప్రభుత్వానికి ఆఖరి రోజులుటి

ప్రజాశక్తి – లావేరు

ప్రజాకంటక వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు అన్నారు. మండలంలోని బెజ్జిపురం, బుడుమూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకొచ్చిన జగన్‌ అరాచక పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అథోగతిపాల్జేశారని విమర్శించారు. ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు దేన్నీ వదలకుండా దోచుకున్నారని ఆరోపించారు. సంక్షేమం పేరిట ప్రజలపై అనేక రకాలుగా భారాలు మోపారని విమర్శించారు. అక్రమ ఆస్తులు కూడబెట్టుకుని 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌, అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును 53 రోజులు జైల్లో పెట్టారని తెలిపారు. వైసిపి నాయకుల మాయమాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని సాగనంపి, టిడిపికి పట్టం కట్టాలని కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ముప్పిడి సురేష్‌, ప్రధాన కార్యదర్శి పి.మధు, ఎఎంసి మాజీ చైర్మన్‌ ఐ.తోటయ్యదొర మాజీ ఎంపిపి మీసాల వెంకటరమణ, టిడిపి నాయకులు డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న కళావెంకటరావు

➡️