తీర ప్రాంతాల్లో లక్ష్మీదేవి పర్యటన

జిల్లాలో గడచిన రెండు రోజులుగా తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను వలన చేపల వేట సాగక ఇబ్బంది పడుతున్న మత్య్సకారులను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పరామర్శించారు. మంగళవారం కళింగపట్నం, కె.మత్య్సలేశం, బందరువానిపేట గ్రామాల్లో

కళింగపట్నం తీరంలో పర్యటిస్తున్న లక్ష్మీదేవి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో గడచిన రెండు రోజులుగా తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్‌ తుపాను వలన చేపల వేట సాగక ఇబ్బంది పడుతున్న మత్య్సకారులను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పరామర్శించారు. మంగళవారం కళింగపట్నం, కె.మత్య్సలేశం, బందరువానిపేట గ్రామాల్లో ఆమె పర్యటించి మత్య్సకారులతో మాట్లాడారు. చేపల వేటతో నిత్యం రద్దీగా ఉండే సముద్ర తీరంలో తుపాను ప్రభావాన్ని ఆమె పరిశీలిం చి మత్య్సకారులతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. గార మండలంలో పలు గ్రామాల్లో రైతులను కలిసి ఓదార్చారు. పంట చేతికి వస్తున్న సమయంలో ప్రకృతి వైఫరీత్యాల వలన రైతులు పూర్తిగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆమెతో పాటు టిడిపి నాయకులు లొపింటి రాధాకృష్ణ రెడ్డి, గార మండల టిడిపి ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్‌, జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొట్నురు కృష్ణమూర్తి, మండల ఉపాధ్యక్షులు వెలమల శ్రీనివాస్‌, దేవదాస్‌ మాస్టారు, జిల్లా మత్స్యకార సంఘ సభ్యులు దుమ్ము సందరయ్య, పొట్నురు వైకుంఠరావు, కోట లక్ష్మయ్య, ఇప్పిలి శివ, పప్పు అప్పారావు, మైలపల్లి పోలిసు, జనసేన జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షులు గుంట శ్రీను పాల్గొన్నారు.

 

➡️