తెలుగు మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం-శ్రీకాకుళం ప్రాంగణం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా రాజమహేంద్రవరంలో జనవరి 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కెవిజిడి బాలాజీ

ఎచ్చెర్ల : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం-శ్రీకాకుళం ప్రాంగణం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా రాజమహేంద్రవరంలో జనవరి 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని, తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలని ట్రిబుల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కెవిజిడి బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అంతరించిపోతున్న తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను, తెలుగుభాష ఔన్నత్యాన్ని తెలియజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సాహితీ ప్రక్రియలోని ప్రముఖ సాహితీ వేత్తలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచారకమిటీ సభ్యుడు రవికుమార్‌, అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. ఉదయ కిరణ్‌, ఐఐఐటి ఒఎస్‌డి సుధాకర్‌ బాబు, ఎఒ ముని రామకృష్ణ, డీన్‌ మోహన్‌ కృష్ణ చౌదరి, ఎఫ్‌ఒ డా.అసిరినాయుడు, వెల్ఫేర్‌ డీన్‌ గేదెల రవికుమార్‌, ఐఐఐటి తెలుగు శాఖ అధ్యక్షులు డా. జి.ప్రకాశరావు, డా.పి.ముకుందరావు, డా.పి.చిరంజీవిరావు, పిఆర్‌ఒ మామిడి షణ్ముఖ నారాయణరావు పాల్గొన్నారు.

 

➡️