ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ పేర్కొన్నారు. నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1,2,4,7వ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ

జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ పేర్కొన్నారు. నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1,2,4,7వ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు తీసుకుంటున్న చర్యలను పౌర సరఫరాలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు తడిసిన ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతాన్ని ఎక్కువగా తీస్తున్నారని పలువురు సభ్యులు ప్రస్తావించారు. నిర్ధేశించిన ప్రకారం ఆరబెట్టుకునే సౌకర్యం రైతులకు ఉండక తేమ శాతం ఉంటోందని, కష్టసమయంలో రైతాంగానికి మిల్లర్లు సైతం సహకరించాలని ఆమె సూచించారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చడమే కాకుండా కిఢ్న వ్యాధిగ్రస్థులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తోడ్పాటు అందించారని సమాy ేశంలో ప్రస్తావించారు. ఆర్‌డబ్య్లుఎస్‌శాఖపై చర్చ కొనసాగిస్తూ సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కిడ్నీ రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడంలో జరిగిన కృషిని ప్రస్తావించారు. అనంతరం గృహ నిర్మాణ శాఖ, సహకారశాఖ, డిసిసిబి, చేనేత, జౌళీశాఖ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలశాఖ, జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా నీటి యాజమాన్యశాఖ, పరిశ్రమలశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలపై చర్చించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టి ప్రజలకు అందించాలని అధికారులకు ఆదేశించా రు. 6వ స్థాయీ సంఘం జిల్లా ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్షులు సిరిపురపు జగన్మోహనరావు అధ్యక్షత వహించారు. వివిధ సంక్షేమశాఖల్లో అమలవుతున్న పథకాలపై చర్చించారు. అలాగే 3వ స్థాయీ సంఘ సమావేశానికి జిల్లా ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్షులు పాలిన శ్రావణి అధ్యక్షత వహించారు. సమావేశంలో పశు సంవర్థకశాఖ, మార్కెటింగ్‌, వ్యవసాయశాఖ, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమలశాఖ, అటవీశాఖ ఉద్యానశాఖలపై సమీక్షించారు. 5వ స్థాయీ సంఘ సమావేశానికి వీరఘట్టం జెడ్‌పిటిసి జంపు కన్నతల్లి అధ్యక్షత వహించారు. సమావేశాల్లో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, జిల్లా అధికారులుపాల్గొన్నారు.

 

➡️