నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ

నూతన కార్యవర్గ సభ్యులు

  • ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్‌
  • ఘనంగా ఎస్‌ఎఫ్‌ఐ 42వ జిల్లా మహాసభలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ 42వ జిల్లా మహాసభలను నగరంలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ముందుండి పోరాటాలు చేస్తోందన్నారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా చేసే జిఒ నంబరు 177ను రద్దు చేయాలన్నారు. జిఒ 107, 108ను రద్దు చేసి వైద్య విద్యలో పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ విద్యార్థులకు ప్రభుత్వమే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వాలన్నారు. కళాశాలల్లో నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని పున: ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. డిగ్రీ కళాశాలల్లో పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఫీజుల భారాన్ని తగ్గించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్‌ మాట్లాడుతూ వసతిగృహాలకు సొంత భవనాలు కేటాయించాలని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రాజు అధ్యక్షతన నిర్వహించిన మహాసభల్లో జిల్లా ఉపాధ్యక్షులు డి.చందు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.నూతన కార్యవర్గం ఎన్నికమహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా అధ్యక్షులు డి.చంద్రశేఖర్‌, కార్యదర్శిగా బి.హరీష్‌, సహాయ కార్యదర్శిగా సంతు తిరుపతి, ఉపాధ్యక్షులుగా దుర్గాప్రసాద్‌, సిహెచ్‌.రాజుతో పాటు సభ్యులను ఎన్నుకున్నారు.

 

➡️